JAISW News Telugu

Trump Victory : దూసుకెళ్తున్న ట్రంప్..ఖాతాలో మరో భారీ విజయం.. వేడెక్కుతున్న అమెరికా రాజకీయాలు..

Trump Victory

Donald Trump Victory

Trump Victory : ఈ ఏడాది డిసెంబర్ లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగేండ్లకొకసారి ఈ ఎన్నికలు జరుగుతాయని తెలిసిందే. ప్రస్తుతం అక్కడ డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉంది. జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పదవీ కాలం ఇంకో ఏడాది మాత్రమే ఉంది.

ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ ఎన్నికల కోసం ఇప్పటినుంచే సన్నాహాలు చేపట్టింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను తమ పార్టీ అభ్యర్థిగా ఎన్నుకుంది. ఆయనపై పలు నేరారోపణలు, కేసులు ఉన్నప్పటికీ.. ట్రంప్ పైనే పార్టీ విశ్వాసం ఉంచింది. 2019 నాటి ఎన్నికల్లో ఓడినా మళ్లీ ట్రంప్ అభ్యర్థిత్వానికే మొగ్గు చూపింది.

ఇక అభ్యర్థిని ఎంచుకోవడానికి మొన్న అయోవా స్టేట్ లో నిర్వహించిన ప్రాథమిక ఎలక్ట్రోరల్ ఎన్నికలో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆయనకు 52.8 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. అభ్యర్థి ఎన్నికల్లో నిలిచిన రాన్ డీశాంటీస్-21.4, నిక్కీ హేలీ-17.7, వివేక్ రామస్వామి-7.2 శాతం ఓట్లు పడ్డాయి. నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి ఇద్దరూ భారత సంతతికి చెందిన వాళ్లే.

వివేక్, రాన్ డీశాంటీస్ ఇప్పటికే తమ అధ్యక్ష ఎన్నికల్లో రేసు నుంచి తప్పుకున్నారు. తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం పార్టీలో ట్రంప్ కు పోటీ ఇస్తోన్నది ఒకే ఒక్క నిక్కీ హేలీ మాత్రమే. వారిద్దరిలో తమ అభ్యర్థిగా ఎవరినీ ఎంచుకోవాలనే విషయంపై ఇప్పుడు తాజాగా మరో స్టేట్ లో ఎన్నిక ప్రక్రియ చేపట్టారు.

న్యూ హ్యాంప్ షైర్ లో నిర్వహించిన ఈ ఎన్నికలో డొనాల్డ్ ట్రంప్ భారీ విజయాన్ని సాధించారు. నిక్కీ హేలీ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ట్రంప్ నకు 53.8 శాతం మేర ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తంగా 41,423 ఓట్లు పడ్డాయి. నిక్కీ హేలీకి 36,083 ఓట్లు పడ్డాయి. ఇవి 46.1శాతం. కౌంటింగ్ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇద్దరి ఓట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version