Rishabh Panth : భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య చెపాక్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు రిషబ్ పంత్, లిటన్ దాస్ హోరాహోరీగా తలపడ్డారు. స్టంప్ మైక్‌లో హిందీలో వీరిద్దరి సంభాషణ రికార్డయింది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు కేవలం 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. దీని తర్వాత, యశస్వి జైస్వాల్, పంత్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు జైస్వాల్, రిషబ్ పంత్ (39) నాలుగో వికెట్‌కు 99 బంతుల్లో 62 పరుగులు జోడించారు. 2022లో జరిగిన కారు ప్రమాదం తర్వాత తొలి టెస్టు ఆడుతున్న రిషబ్ పంత్ 83 నిమిషాల పాటు క్రీజులో ఉన్నాడు, ఆ సమయంలో లిటన్ దాస్‌తో వాగ్వాదం వైరల్ అయింది.
రిషబ్ పంత్ పరుగుల కోసం క్రీజ్ నుంచి బయటకు వచ్చి వెనుదిరిగాడు. అంతలో బంగ్లాదేశ్ ఫీల్డర్ విసిరిన బంతి రిషబ్ పంత్ ప్యాడ్‌లకు తగిలింది. ఈ ఘటనపై రిషబ్ పంత్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. నన్ను ఎందుకు కొడుతున్నావ్ అని పంత్ లిటన్ దాస్‌ను అడిగాడు. అంతే వీరిద్ధరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యశస్వి జైస్వాల్ అర్ధ సెంచరీ..
ఫాస్ట్ బౌలర్ హసన్ మహమూద్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ బౌలింగ్ దాటికి భారత బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. దీంతో టీమిండియా 144 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. జైస్వాల్ 118 బంతుల్లో 9 ఫోర్ల తో 56 పరుగులు చేశాడు. బౌలర్ల నుంచి ఎలాంటి సవాల్ ఎదురవడంతో భారత బ్యాట్స్‌మెన్ నిరాశపరిచారు. వరుసగా వికెట్లు పడిపోయాయి. జైస్వాల్ కాస్త నిలకడగా రాణించి హాఫ్ సెంచరీ చేసినా ఆ తర్వాత అవుటయ్యాడు.
Argument between Litton das & Rishabh pant.#INDvBAN pic.twitter.com/P4Wrf170UJ
— Sports With Naveen (@sportscey) September 19, 2024