\Rishabh Pant : భారత స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేయకపోవడంపై మౌనం వీడాడు. తాను డబ్బు కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ని విడిచి వెళ్లలేదని ట్వీట్‌లో స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ జట్టు తమ కెప్టెన్‌ను కొనసాగించకపోవడానికి గల కారణాన్ని సునీల్ గవాస్కర్ వివరిస్తున్న స్టార్ స్పోర్ట్స్ వీడియోపై పంత్ స్పందించారు.
ఈ వీడియోలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ, వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ రిటెన్షన్ ఫీజు విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్, రిషబ్ పంత్ మధ్య విభేదాలు ఉండవచ్చని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 24, 25 తేదీల్లో జరగనున్న మెగా వేలంలో క్యాపిటల్స్ పంత్‌ను తిరిగి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించవచ్చని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న రిషబ్ ట్వీట్
ఈ వీడియోపై రిషబ్ పంత్ స్పందించారు. డబ్బు కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును విడిచిపెట్టలేదని స్పష్టం చేశారు.. గవాస్కర్ వీడియోపై పంత్ తన సమాధానం ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న పంత్ తన ట్వీట్ తో స్పష్టతనిచ్చాడు. నా రిటైన్ డబ్బు గురించి కాదని తాను కచ్చితంగా చెప్పగలనని పేర్కొన్నారు.
గవాస్కర్ స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్‌ను తిరిగి తమ జట్టులోకి తీసుకోవాలని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. కొన్నిసార్లు ఒక ఆటగాడిని కొనసాగించవలసి వచ్చినప్పుడు, ఫ్రాంచైజీలు, ఆటగాళ్ల మధ్య డబ్బులకు సంబంధించి చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు.. తమ ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న కొందరు ఆటగాళ్లు ఎక్కువ మొత్తంలో రిటెన్షన్ ఫీజును డిమాండ్ చేస్తుంటారని పేర్కొన్నారు. ఇక్కడ కొంత భిన్నాభిప్రాయాలు ఉండవచ్చని తాను భావిస్తున్నట్లు గవాస్కర్ పేర్కొన్నారు. కానీ ఢిల్లీ రిషబ్ పంత్‌ను తిరిగి తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు.
ఐపీఎల్ రిటైన్ గురించి మాట్లాడుతూ, సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ 2025 వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ నలుగురు ఆటగాళ్లను ఉంచుకుంది. అక్షర్ పటేల్‌ను రూ.16.5 కోట్లకు, కుల్దీప్ యాదవ్‌ను రూ.13.5 కోట్లకు, దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ ట్రిస్టన్ స్టబ్స్‌ను రూ.10 కోట్లకు, అన్‌క్యాప్‌డ్ వికెట్‌కీపర్ అభిషేక్ పోరెల్‌ను రూ.4 కోట్లకు రిటైన్ చేసుకుంది.