Bangladesh : బంగ్లాదేశ్ లో అల్లర్లు.. సరిహద్దులు దాటి వస్తున్న ఇండియన్స్

Bangladesh
Bangladesh : ఉద్యోగాల్లో కోటాపై బంగ్లాదేశ్ లో అల్లర్లు జరుగుతుండగా అక్కడి నుంచి భారతీయులు సరిహద్దులు దాటి స్వదేశానికి వస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని సంస్కరించాలని, ప్రతిభకు పట్టం కట్టాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో గత కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. అల్లర్లు కాస్తా హింసాత్మకంగా మారి ఇప్పటి వరకు 105 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అక్కడి భారతీయులు స్వదేశానికి తిరిగివస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 450 మంది భారత పౌరులు సరిహద్దు దాటి మేఘాలయ చేరుకున్నట్లు అధికారులు శనివారం తెలిపారు.