Rice : భారత్ కాకుండా ప్రపంచంలో అన్నం ఎక్కువ తినే దేశం ఏదో తెలుసా ?
Rice : సాధారణంగా తెలుగు వాళ్లకు అన్నం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మూడు పూటలా అన్నం తింటుంటారు. అన్నం తినకపోతే మనలో చాలామందికి ఆ రోజు నిద్రపట్టదు. కొందరు అయితే గ్రామాల్లో ఇప్పటికీ ఉదయం చద్దిన్నం, మధ్యాహ్నం భోజనం, మళ్లీ రాత్రి కూడా వేడి వేడిగా అన్నం తినేస్తుంటారు. ఇంట్లో అయినా లేదా ప్రత్యేక కార్యక్రమమైనా..వేడి అన్నం-పప్పు లేదంటే.. అన్నం సాంబార్ ఇలా ఏదో ఓ కాంబో ఉండాల్సిందే. బయట తిన్నవారు కూడా.. చాలా చోట్ల అన్నం ఉందా అని.. హోటళ్లలో కూడా అడిగి తినేస్తుంటారు. అయితే అన్నం అంటే తెగ ఇష్టపడే మన తెలుగు ప్రజలకు ఏ దేశం బియ్యం ఎక్కువగా తింటుందో తెలుసా? అయితే దానికి జావాబు మాత్రం కచ్చితంగా మన భారతదేశం కాదు.
దానికి సరైన సమాధానం చైనా. చైనీయులు ప్రపంచంలోనే అత్యధికంగా అన్నం తింటారట. ప్రపంచంలోని బియ్యంలో 30 శాతం చైనాలో ఉత్పత్తి అవుతోంది. చైనా తర్వాత ప్రపంచంలోనే ఎక్కువగా బియ్యం వాడే దేశం భారతదేశం. ఆ తర్వాత ఇండోనేషియా మూడో స్థానంలో ఉంది. ఈ జాబితాలో బంగ్లాదేశ్ తర్వాతి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో వియత్నాం, ఫిలిప్పీన్స్, థాయ్లాండ్ ఉన్నాయి. కంబోడియాలో కూడా బియ్యం ఎక్కువగా వినియోగిస్తారు. కంబోడియాలో ప్రతి వ్యక్తి సంవత్సరానికి 249.30 కిలోల బియ్యం తింటారు.
ప్రపంచంలోనే అత్యధిక బియ్యం ఉత్పత్తి చైనాలో ఉంది. ప్రపంచంలోని వరి ఉత్పత్తిలో చైనా మాత్రమే 28శాతం పూర్తి చేస్తుంది. వరి ఉత్పత్తిలో చైనా తరువాత, భారతదేశం, ఇండోనేషియా రెండవ , మూడవ స్థానంలో ఉన్నాయి. అయితే, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు. భారతదేశంలో, దక్షిణ, తూర్పు భారతదేశంలోని రాష్ట్రాల్లో బియ్యం సాధారణంగా వినియోగిస్తారు. ఈ రాష్ట్రాల్లో బియ్యం ప్రధాన ఆహారం. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో బియ్యం వినియోగం చాలా ఎక్కువ.