Saaree Heroine : అల్లాడిస్తున్న ఆర్జీవీ.. ‘శారీ’ హీరోయిన్ వీడియోతో నెటిజన్ల ఫిదా!

RGV Saaree heroine’s viral videos
Saaree Heroine : దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. వివాదాలు ఆయనకు కొత్తేమి కాదు. వివాదాలు ఆయన వెంట రావు.. ఆయనే వివాదాల వెంట పరుగులు పెడుతుంటాడు. అలా ఉంటది వర్మతో. ఆయన గిరి గీసుకొని ఒక జానర్ కే పరిమితం అయిన వ్యక్తి కాదు.. రొమాన్స్ నుంచి హార్రర్, మర్డర్, థ్రిల్లర్, ఇప్పుడు పొలిటికల్.. ఇలా అన్నింట్లో ఫింగర్ పెడుతూ.. అన్నీ బ్లాక్ బస్టర్ గా తీసుకెళ్తాడు.
ఏపీ పొలిటికల్ పై ఆయన తీసిన వ్యూహం కోర్టు కేసుల్లో చిక్కుకుంది. రిలీజ్ పై వాయిదాలపై వాయిదాలు పడుతున్నాయి. ఆ మధ్య ఇన్ స్టాలో ఒక రీల్ చేసిన అమ్మాయిపై మనసు పారేసుకున్న వర్మ ఆమె గురించి సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేశాడు. వర్మ ఒక్క పోస్ట్ తో ఆ అమ్మాయి గూగుల్ సెర్చింజన్ లో టాప్ గర్ల్ గా నిలిచింది. ఎలాగోలా ఆ అమ్మాయిని పట్టుకున్నాడు. ఆమెది కేరళ, పేరు ఆరాధ్యదేవి అని తెలిసింది. ఇక ఆలస్యం చేసేది లేదని వెంటనే ఆమెతో సినిమాను ప్లాన్ చేశాడు. అదే ‘శారీ’.
ఆర్జీవీ ఆరాధ్యదేవిని మొదట చూసినప్పుడు చీర కట్టుతో కట్టి పడేసింది. ఆ వీడియోలో ఆమె లుక్స్ నిజంగా బ్యూటిఫుల్ అనే పదానికి వంద రేట్లని బల్లగుద్ది మరీ చెప్పవచ్చు. ఈ మూవీని ఆర్జీవీ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.
రీసెంట్ గా మరోసారి ఆ అమ్మాయి వీడియో షేర్ చేశారు వర్మ. సంగీతం వింటున్న ఆ అమ్మాయి వీడియోను పోస్ట్ చేసిన ఆయన ‘ఆ అమ్మాయి సంగీతం వింటుందా? లేక అమ్మాయి నుంచే సంగీతం వస్తుందా?’ అని కోట్ రాశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఫిదా అయిపోయి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి వీడియోలను ఎక్కడి నుంచి పట్టుకస్తావు సామి అంటూ పొగుడుతున్నారు.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram