Deputy CM Pawan Kalyan : ఈరోజు (మంగళవారం) ఉదయం కాకినాడ కలెక్టరేట్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, అటవీశాఖ, కాలుష్య నియంత్రణ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రధాన సమస్యలపై చర్చించారు. పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి పారుదల శాఖల పరిధిలోని పలు సమస్యలను పవన్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో ఎపీ ఉదయ్ శ్రీనివాస్, జిల్లా పరిషత్ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, వనమాడి కొండబాబు, పంతం నానాజీ, వరుపుల సత్యప్రభ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం గొల్లప్రోలులో నివాసానికి బయలుదేరి వెళతారు.