CM Revanth : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల గడువు సమీపిస్తోంది. గురువారంతో నామినేషన్ల పర్వం ముగిసింది. ఈనెల 29 వరకు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలు ఉండగా బీఆర్ఎస్ ఖాతాలో 9, బీజేపీకి 4, కాంగ్రెస్ కు 3 స్థానాలున్నాయి.
రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముగ్గురు లోక్ సభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఎన్నికలను మూడు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. అత్యధిక స్థానాలు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిలో అత్యధిక నామినేషన్లు పడటం గమనార్హం.
మల్కాజిగిరిలో 117 నామినేషన్లు దాఖలయ్యాయి. తరువాత స్థానాల్లో నల్గొండ, భువనగిరి నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ 114 నామినేషన్లు నమోదు కావడం విశేషం. తరువాత పెద్దపల్లిలో నామినేషన్లు అధికంగా పడ్డాయి. మొత్తం నియోజకవర్గాల్లో 1,488 నామినేషన్లు దాఖలయ్యాయి. మల్కాజిగిరిలో బీజేపీ నేత ఈటల రాజేందర్ దూసుకుపోతున్నారు.
ఆదిలాబాద్ -42, కరీంనగర్-94, నిజామాబాద్ – 90, జహీరాబాద్ -68, మెదక్ -90, సికింద్రాబాద్ -75, హైదరాబాద్ -85, చేవెళ్ల-88, మహబూబ్ నగర్ -72, వరంగల్ – 89, మహబూబాబాద్ -56, ఖమ్మం -72 నామినేషన్లు పడ్డాయి. దీంతో తెలంగాణలో మరోమారు రాజకీయ సంగ్రామం జరగనుంది. మూడు పార్టీలు విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నాయి.
సర్వేలన్ని బీజేపీనే అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. కాంగ్రెస్ మాత్రం ఇండియా కూటమి విజయం సాధిస్తుందని వెల్లడిస్తున్నాయి. ఈనేపథ్యంలో రెండు పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికారం తమదంటే తమదనే వాదనలు తెస్తున్నాయి.