Revanth’s key decision:బీఆర్ఎస్‌కు మరో దెబ్బ..మెట్రో విస్తరణపై రేవంత్ కీలక నిర్ణయం

Revanth’s key decision:తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఐపీఎస్ అధికార బదిలీలు, టీఎస్ పీఎస్సీ ప్రక్షాళన పట్ల కీలక నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశారు. తాజాగా మరోసారి రేవంత్ సంచలన నిర్ణయం తీసుకోవడం తో ప్రతిపక్ష పార్టీకి మరో దెబ్బ తగిలినట్టయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాయదుర్గం-శంషాబాద్ విమానాశ్రయం మార్గం లో మెట్రో రైలు పొడిగించాలని భావించారు. అందుకు మార్గదర్శకాలను కూడా సిద్ధం చేశారు. అయితే కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మెట్రో విస్తరణ అవసరం లేదని చెప్పినట్టు తెలుస్తోంది.

రాయదుర్గ్-విమానాశ్రయ మార్గంలో మెట్రో అవసరం లేదని రేవంత్ తేల్చి చెప్పారు. అందుకు బదులుగా JBS-ఫలక్‌నుమా కారిడార్‌ను పూర్తి చేసి, పహాడీ షరీఫ్ మీదుగా విమానాశ్రయం వరకు విస్తరించడంతోపాటు లక్డికాపూల్ మరియు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య లైన్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఓల్డ్ సిటీ డెవలప్‌మెంట్‌పై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం)కి చెందిన ఏడుగురు శాసనసభ్యులతో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులకు, ముఖ్యంగా ఐటీ కారిడార్‌కు వెళ్లే వారికి ఏ మార్గం మరింత ఉపయోగకరంగా ఉంటుందో చూడాలి.

ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి ప్రతిపాదిత ఎయిర్‌పోర్ట్ మెట్రో రైలు మార్గంపై ముఖ్యమంత్రికి సందేహాలు ఉన్నాయని, కేవలం రియల్టర్లకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని ఆయన చెప్పినట్టు సమాచారం. గతంలో BRS ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేసి లబ్ధి పొందాలని భావించింది. రేవంత్ నిర్ణయంతో మరోసారి బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలినట్టయింది.

TAGS