JAISW News Telugu

CM Revanth : రేవంత్ మంత్రివర్గ విస్తరణ – కోదండరామ్ కు ఛాన్స్, లిస్టులో..!!

CM Revanth

CM Revanth

CM Revanth : మంత్రివర్గ విస్తరణ దిశగా సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నారు. ఈ సాయంత్రం రేవంత్ ఢిల్లీ వెళ్తున్నారు. పార్టీ నాయకత్వంతో సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ..ఎంపీ అభ్యర్దుల పైన రేవంత్ హైకమాండ్ చర్చించనున్నారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనుండటంతో మంత్రివర్గంతో పాటు గా నామినేటెడ్ పదవుల భర్తీ చేయాలని నిర్ణయిం చారు. లోక్ సభ అభ్యర్దుల విషయంలోనూ ఇప్ప టికే ఒక జాబితా సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఇక, మంత్రి వర్గ విస్తరణలో ఛాన్స్ దక్కేదెవరనే చర్చ మొద లైంది.

రేవంత్ ఢిల్లీ టూర్ : మరి కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ సమ యంలోనే బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పైన ప్రచారం మొదలైంది. ఇటు రేవంత్ అలర్ట్ అయ్యారు. పాల నా పరంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నా రు. ఇదే సమయంలో ఎన్నికల షెడ్యూల్ కు ముం దుగానే మంత్రివర్గ విస్తరణతో పాటుగా నామినేటె డ్ పదవుల భర్తీ పూర్తి చేయాలని భావిస్తున్నారు.

ఇందు కోసం పార్టీ హైకమాండ్ తో చర్చించి అను మతి తీసుకొనేందుకు సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్తు న్నా రు. తెలంగాణ మంత్రివర్గంలో మరో ఆరుగురికి అవకాశం ఉంది. ఇప్పటికే రేవంత్ తన మంత్రి వ ర్గంలో కొత్త వారి జాబితా సిద్దం చేసినట్లు సమా చారం. ఈ జాబితాకు పార్టీ అధినాయకత్వం ఆ మోద ముద్ర వేస్తే వెంటనే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది.

హైకమాండ్ ఆమోదం: మంత్రివర్గ విస్తరణలో భాగంగా ప్రొఫెసర్ కోదండరామ్ కు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. కోదండరామ్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించారు. న్యాయ పరమైన అంశాలతో నియామక ప్రక్రియ నిలిచిపో యింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా..ఆరు నెలల్లోగా చట్ట సభలకు ఎన్నికయ్యే అవకాశం ఉంది.

దీంతో, మంత్రిపదవికి ఆయన పేరు ఖాయం చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక, రేవంత్ మంత్రివర్గంలో ఇప్పటి వరకు అవకాశం దక్కని అదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరా బాద్ కు ఈ సారి విస్తరణలో ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. ఇదే సమయంలో సామాజిక సమీకరణాలు కీలకం కానున్నాయి. ఆదిలాబాద్ నుంచి గడ్డం బ్రదర్స్ మధ్యే పోటీ నడుస్తోంది. చెన్నూరులో గెలిచిన వివేక్, బెల్లంపల్లిలో గెలిచిన వినోద్ కేబినెట్ బెర్త్ కోసం సోనియాను కలిసారు.

ఛాన్స్ దక్కేదెవరికి: రేవంత్ తనకు అవకాశం ఇస్తా రని వివేక్ నమ్మకం తో ఉన్నారు. బోధన్ ఎమ్మె ల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌ మోహన్ రావ్ కూడా కేబినెట్ ప్రయత్నాల్లో ఉన్నా రు. ఉమ్మ డి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగా రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నాయి. హైదరా బాద్ నుంచి కాంగ్రె స్‌ అభ్యర్థులు ఎవరూ గెలవ లేదు. అయిన ప్పటికీ మైనార్టీ కోటాలో ఫిరోజ్‌ఖాన్‌ పోటీలో ఉన్నారు. కీలకమైన హోం శాఖ ఎవరికి అప్పగిస్తారనేది తేలా ల్సి ఉంది. సాగుతోంది.

దీంతో..కేబినెట్ విస్తరణ – శాఖల ఖరారు పైన ఆస క్తి కొనసాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ కు ముందే మంత్రివర్గ విస్తరణతో పాటుగా నామినే టెడ్ పద వులను భర్తీ చేయటం ద్వారా ఎన్నికల్లో మరింత జోష్ తో కేడర్ పని చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో, రేవంత్ ఢిల్లీ పర్యటన పైన ఆసక్తి కొనసాగుతోంది.

Exit mobile version