JAISW News Telugu

Revantha Reddy:తెలంగాణ సీఎంగా రేపు రేవంత్‌రెడ్డి ప్ర‌మాణ స్వీకారం

Revantha Reddy:తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యాన్ని సాధించింది. రాష్ట‌క్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి కాంగ్రెస్‌కు అవ‌స‌ర‌మైన మేజిక్ ఫిగ‌ర్ ను సునాయ‌సంగా సాధించింది. ఈ ఎన్నిక‌ల్లో అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత రెండు ద‌ఫాలుగా అధికారిన్ని చేప‌ట్టి ముచ్చ‌ట‌గా మూడ‌వ సారి అధికారిన్ని చేప‌ట్టాల‌ని ఉవ్విళ్లూరిన‌ బీఆర్ఎస్ ఆశ‌లు ఆవిరైపోయాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అనూహ్య విజ‌యాన్ని సాధించి 64 సీట్ల‌ని ద‌క్కించుకుంది. అధికార బీఆర్ ఎస్ మాత్రం 39 స్థానాల‌కే ప‌రిమిత‌మైపోయింది. బీజేపీ 9, ఎంఐఎం 7, సీపీఎం 1 స్థానాల‌తో స‌రిపెట్టుకున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగ‌ర్‌ని మించి సీట్ల‌ని ద‌క్కించుకోవ‌డంతో సోమ‌వారం ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి రంగం సిద్ధం చేస్తోంది. ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ స్వీకారం సోమ‌వారం జ‌ర‌గ‌నుంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

హైద‌రాబాద్ ఎల్బీ స్టేడియంలో ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్నారు. ఇందు కోసం ఏర్పాట్లు చేయాల‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణుల‌కు సూచించారు. ఇదిలా ఉండ‌గా ఆదివారం రాత్రి సీఎల్పీ స‌మావేశం జ‌రిగే అవ‌కాశం ఉంది. సీఎల్పీ నేత‌గా రేవంత్ రెడ్డిని ఏక‌గ్రీవంగా పార్టీ శ్రేణులు ఎన్నుకోనున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక డిప్యూటీ సీఎంగా మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌మాణం చేస్తార‌ని, ప్ర‌స్తుతం గ‌చ్చిబౌళిలోని ఎల్లా హోట‌ల్‌లో సీఎల్పీ స‌మావేశం జ‌ర‌గుతున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే రేవంత్‌రెడ్డి,

విజ‌య‌శాంతి ఎల్లా హోట‌ల్‌కు చేరుకున్నారు. మ‌రి కొద్ది క్ష‌ణాల్లో ఎల్లా హోట‌ల్‌కు గెలిచిన 27 మంది ఎమ్మెల్యేలు చేరుకోనున్నారు. ఆ త‌రువాత మిగ‌తా వారు కూడా చేరుకుని సీఎల్పీ నేత‌గా రేవంత్ రెడ్డిని ఎన్నుకోనున్నార‌ట‌. ఇక ఈ నెల 9న కేబినేట్ విస్త‌ర‌ణ కూడా జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని, ఆ ర‌తువాత ప‌రేడ్ గ్రౌండ్స్‌లో భారీ బ‌హిరంగ స‌భ‌ని కూడా నిర్వ‌హించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. అంతే కాకుండా రేవంత్ ప్ర‌మాణ స్వీకారానికి సోనియా గాంధీ, రాహుల్‌, ప్రియాంక‌, మ‌ల్లిఖార్జున ఖ‌ర్జే స‌హా ప‌లువురు కీల‌క నేత‌లు హాజ‌రు కానున్నారు.

Exit mobile version