Revanth vs Bhatti : రేవంత్ రెడ్డి వర్సెస్ భట్టి.. మైండ్ గేమ్ నడుస్తోందా?
Revanth vs Bhatti : తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గతంగా అగ్గి రాజుకుంటుందా? అంటే కాస్త సందేహాలే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చిరకాలంగా పని చేసిన నేత భట్టి విక్రమార్క. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా ఆయన కేబినేట్ మంత్రిగా పని చేశారు. తెలంగాణలో ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దళిత నేతగా తాను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అనుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి టీపీసీసీ ఎంట్రీ.. ఎన్నికలు అధిష్టానం సీఎంగా రేవంత్ వైపే మొగ్గడంతో భట్టి డిప్యూటీతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది.
సీనియారిటీ, దళిత కార్డు ఆధారంగా తనను ఎంపిక చేస్తారని భట్టి ఆశించినా రేవంత్ రెడ్డి పాపులారిటీకి హైకమాండ్ ఓటేసింది. ఇరువురు నేతలు ఒకరితో ఒకరు మైండ్ గేమ్ ఆడుతున్నట్లు ప్రస్తుతం పార్టీలో చర్చ నడుస్తోంది.
భట్టి తన సతీమణి నందినిని ఖమ్మం లోక్ సభ సెగ్మెంట్ నుంచి బరిలోకి దింపాలని అనుకుంటున్నారు. ఇది ఇంకా ప్రతిపాదన దశలో ఉండగానే రేవంత్ రెడ్డి వేగంగా పావులు కదుపుతూ ఖమ్మం లోక్ సభ సెగ్మెంట్ నుంచి సోనియాగాంధీ పోటీ చేసే అంశాన్ని తెరపైకి తెచ్చారు.
భట్టి పెద్ద పవర్ సెంటర్ కావడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదని తెలుస్తోంది. సోనియా గాంధీని తీసుకురావడం వల్ల ఖమ్మం విషయంలో ఇతర నేతలు చేసిన ఆరోపణలను నీరుగార్చడమే అవుతుంది. ఇదిలా ఉంటే భట్టి కూడా తన భార్యను ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చేలా చేశారు.
తనను ముఖ్యమంత్రిని చేయనందుకు భట్టి, క్యాడర్ ఎలా నిరాశ చెందారో భట్టి భార్య నందిని ఇంటర్వ్యూలో వివరించారు. రేవంత్ రెడ్డికి పరోక్ష హెచ్చరికలా ఆ రాష్ట్రంలో ‘రెబెల్స్’ అని కూడా ఆమె ప్రస్తావించారు. మరి ఖమ్మం విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ బలహీనంగా ఉండడంతో పాటు ఆంధ్రా, టీడీపీ ఓటర్ల ప్రభావం దృష్ట్యా ఖమ్మం కాంగ్రెస్ కు సులువైన సీటు. ఒకవేళ సోనియాగాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయకపోతే పొంగులేటి సోదరుడు లేదా నామా నాగేశ్వరరావు రేవంత్ రెడ్డికి టికెట్ దక్కే అవకాశం ఉందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.