Revanth Target KCR : కేసీఆర్ తల్లిని.. మీడియాపై దారుణం.. రేవంత్ గలీజు మాటలు..

Revanth Target KCR
Revanth Target KCR Mother : పోలింగ్ దగ్గర పడుతున్నా కొద్దీ నేతల మాటలు మరింత పదునుగా మారుతున్నాయి. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు కనీసం వినేందుకు అవకాశం లేకుండా నాయకులు రెచ్చిపోతున్నారు. ఎలక్షన్ కమిషన్ ప్రచారాలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నా నాయకుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదనిపిస్తుంది. రేవంత్ ఇటీవల జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన తీరు పలువురిని ఆగ్రహానికి గురి చేసింది. దీంతో పాటు ఆయన మీడియా ప్రతినిధులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి స్వరంలో రోజు రోజుకు మార్పు కనిపిస్తుంది. ఇటీవల ఆయన ఒక మీడియా ప్రతినిధిని గలీజుగా ధూషించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ ఫారంపై వైరల్ గా మారింది. దీంతో పాటు ఆయన ప్రసంగిస్తూ ‘కేసీఆర్ నువ్వు ఒక ఒక అమ్మకు పుట్టుంటే’ అంటూ మాట్లాడిన తీరుపై కూడా కొంత ఆగ్రహం కనిపించింది. సాధారణ పౌరుడి నుంచి ప్రముఖ నేతల వరకు మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి. కానీ ఇలా మట్లాడితే ఇబ్బంది అంటూ మాటలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ ఊపు మీదున్న మాట దేవుడెరుగు డిసెంబర్ 3వ తేదీ ఫలితాలు రిలీజ్ అయ్యే వరకు ఎవరు గెలిచినట్లు, ఎవరు ఓడినట్లు ఎవరికి తెలియదు. అప్పటి వరకు ఇలాంటి ధూషణలతో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కాంగ్రెస్ పార్టీ అభిమానులు అంటున్నారు. రేవంత్ చల్లబడాలని కామెంట్లు చేసే వారు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా ప్రస్తుతం రేవంత్ రెడ్డి స్పీచ్, మట్లాడిన వీడియోలపై నెటిజన్లు ఓటర్ల నుంచి భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.
ఓటమి భయంతో ఉన్మాది లాగా మారి హింసను ప్రేరేపిస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
1. ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే అడివి బాట పార్టీ నక్సలైట్లు మారితే ఈ ప్రభుత్వంలో ఒక్కడు కూడా మిగలడు.
2. ప్రగతి భవన్‌ను బాంబులు పెట్టి పెల్చేస్తాం.
3. ఈ ఎన్నికల్లో కేసీఆర్ తల నరకాల్సిందే.… pic.twitter.com/wQF6M4aV2D
— Telugu Scribe (@TeluguScribe) November 16, 2023