JAISW News Telugu

Revanth Strategy : బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్న రేవంత్ స్ట్రాటజీ!

Revanth Strategy

Revanth Strategy

Revanth Strategy : దేశంలో సార్వత్రిక ఎన్నికల సంరంభం కొనసాగుతోంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అనే రీతిలో ప్రచారంలో దూసుకుపోతున్నాయి. బీజేపీ అయోధ్య రామాలయం, సుస్థిర భారతదేశం నినాదాలతో ముందుకు వెళ్తోంది. దేశాన్ని పాలించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని చెబుతోంది. కాంగ్రెస్ ఏలుబడిలో ఎలాంటి పరిణామాలు చవిచూశామో ప్రత్యక్షంగా అనుభవించాం. దీంతో కాంగ్రెస్ వల్ల దేశానికి నష్టమే కానీ లాభం లేదని బీజేపీ వాదిస్తూ వస్తోంది.

ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీని ఇరకాటంలో పెడుతున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కొత్త పల్లవి అందుకున్నారు. దీంతో బీజేపీ దానికి కౌంటర్ ఇచ్చేందుకు ఆపసోపాలు పడుతోంది. రేవంత్ రెడ్డి పట్టుకున్న పాయింట్ తో బీజేపీకి చిక్కులు ఎదురవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేయడమే ఆర్ఎస్ఎస్ అజెండా అని చెబుతుండటంతో వారు అదిగో దొంగ అంటే భుజాలు పునుక్కున్నంత పనిచేస్తున్నారు.

రేవంత్ రెడ్డి వ్యూహాలు చూసి అధిష్ఠానం కూడా ముచ్చట పడుతోంది. జాతీయ స్థాయిలో కీలక నేతగా ఎదిగే లక్షణాలు ఉన్నాయని భావిస్తోంది. ఇందులో భాగంగా రేవంత్ కు ఇంకా కీలక బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతున్న రేవంత్ రెడ్డి పలుకుబడి అధిష్ఠానం దగ్గర మరింత పెరుగబోతోందని అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపడంలో రేవంత్ రెడ్డి మాటలు బాగా పనిచేస్తున్నాయి. బీజేపీని డైలమాలో పడేసే ఉద్దేశంతో రేవంత్ అందుకుంటున్న పల్లవి జాతీయ స్థాయిలో కూడా మంచి మార్కులు తెచ్చుకుంటోంది. ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డి ని మరిన్ని ప్రాంతాల్లో ప్రచారం చేయడానికి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.

బీజేపీని ఆలోచింపచేసే పనిలో భాగంగా రేవంత్ సక్సెస్ కావడంతో ఆయనతో ఇంకా పలు చోట్ల మాట్లాడించాలని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు ఆయన మాటలు ఉపయోగపడతాయని అనుకుంటోంది. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులను తమ పార్టీ అంబాసిడర్ గా మార్చుకోవాలని చూస్తోంది.

Exit mobile version