Revanth Reddy : రేవంత్ రెడ్డి సంస్కారం మచ్చుతునక ఇదీ..
Revanth Reddy : రేవంత్ రెడ్డి ఒక రాష్ట్రానికి సీఎం అయినా తనకు బతుకునిచ్చిన పార్టీకి.. ఎంకరేజ్ చేసిన నేతలను మరిచిపోలేదు. అందుకే తన టీడీపీ సీనియర్లకు ఎంతో గౌరవం ఇస్తుంటాడు. ఇప్పటికీ చంద్రబాబును రాజకీయ గురువుగా బహిరంగ వేధికలపై చెబుతుంటాడు.
తాజాగా టీడీపీ కురువృద్ధుడు సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఓ కార్యక్రమంలో వీరిద్దరూ కలిశారు. అనంతరం పక్కకు తీసుకెళ్లిన రేవంత్ రెడ్డి.. అశోక్ తో మనసారా మాట్లాడారు. పెద్దాయన ముందు చేతులు కట్టుకొని పద్ధతిగా కూర్చున్నారు.
దీన్ని చూస్తే.. రాజకీయ విలువలు ఇంకా బతికే ఉన్నాయి అని ఈ చిత్రం చెబుతుంది …అశోక్ గారు – రేవంతన్న చిత్రాన్ని అందరూ షేర్ చేస్తూ కొనియాడుతున్నారు. నువ్వు ఏ స్థాయి లో వున్న …. పెద్దవాళ్ళను గౌరవించడం మన సంప్రదాయం అని నిరూపించావని నెటిజన్లు కొనియాడుతున్నారు.