
Revanth Reddy comments on BRS government
CM Revanth : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు అయింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రానికి బీఆర్ఎస్ పీడ విరగడ అయిందని వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం, పేదల అవసరాలు తీర్చే పార్టీగా కాంగ్రెస్ ఎప్పుడు ముందుంటుందన్నారు. తెలంగాణ ఉజ్వలంగా ఎదిగేందుకు తమ వంతు పాటుపడతానని పేర్కొన్నారు.
ప్రజల పనులు నెరవేర్చడంలో ముందుంటాం. వారి ఆంక్షలు తీర్చడంలో కూడా శక్తివంచన లేకుండా కష్టపడతాం. అందరి వాడిగా వారి అవసరాలు తెలుసుకుని తమ బాధలు గుర్తిస్తాం. బానిసత్వపు సంకెళ్లు బద్దలు కావడానికి మా వంతు పాత్ర పోషిస్తాం. తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునేందుకు తగిన వాతావరణం కల్పిస్తాం. ప్రజల ఆకాంక్షలు తీరుస్తాం.
బీఆర్ఎస్ నేతల అవినీతిని బయట పెడతాం. వారి పాలనలో కొనసాగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేయిస్తాం. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు వెనకాం. దీనిపై ఎలాంటి సందేహాలు అవసరం లేదు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులో జరిగిన లోపాలను గుర్తించి చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కొనసాగించిన అవినీతి పరాకాష్టకు చేరింది.
ఇలా రాజకీయ పార్టీల బాగోతాన్ని బయట పెడతాం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతాం. ప్రజల హక్కులకు భంగం కలగకుండా పాలన సాగిస్తాం. పేదవారి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళతాం. ఆరు గ్యారంటీల అమలులో ఎక్కడ కూడా వెనకాడబోం. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఎదుర్కొని నిలబడతాం. నీతివంతమైన పాలన అందించేందుకు కట్టుబడి ఉన్నామని రేవంత్ రెడ్డి తన మనసులోని మాటలను వెల్లడించారు.