Revanth Reddy : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి మొదటి కారణం కేసీఆర్ అహంకారమనే వాదనలు కౌంటింగ్ సమయంలో బాగానే వినిపించాయి. పదేళ్లు సీఎం పీఠంపై కూర్చున్న కేసీఆర్ ప్రజలకు దూరంగా ఉండడం, కేవలం సభలు, సమావేశాలకు మాత్రమే హాజరై ఊకదంపుడు ఉపాన్యాసాలు ఇవ్వడం లాంటివే బీఆర్ఎస్ కొంప ముంచాయని భావించారు. ఎన్నికల ఫలితాలు రిలీజ్ తర్వాత కూడా కేసీఆర్ కు అహం తగ్గలేదు. ఒక దశలో ఎంత పీక్స్ కు వెళ్లిందంటే రేవంత్ ను సీఎంగా చూడడమా? అన్న దశకు వెళ్లిందన్న వాదనలు ఉన్నాయి. అయినా రేవంత్ మాత్రం పదే పదే ఆయన అహంపై దెబ్బకొడుతూ వస్తున్నాడు. ఇప్పుడు ఇలాంటిదే మరోటి జరిగింది.
జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అంతా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి నుంచి ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ కు ఈగో షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ కు హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ జరిగింది. ఆ సమయంలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బాస్ ను హాస్పిటల్ కు వెళ్లి మరీ పరామర్శించాడు. ఇది మొదటి సారి కేసీఆర్ అహంకారాన్ని దెబ్బతీసింది.
ఇది తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఇది జరిగింది రేవంత్ సుహృద్భావంతో ప్రతిపక్ష నేత, సీనియర్ నాయకుడు అని చూసేందుకు వెళ్లినా.. రేవంత్ ను సీఎంగా చూడాలని ఎప్పుడూ అనుకోని కేసీఆర్ అహంకారం దెబ్బతింది. అయితే రాష్ట్రంపై కేసీఆర్ ముద్ర ఉండద్దని రేవంత్ ప్రభుత్వం కొన్ని మార్పులు చేస్తుందని ఇది కూడా కేసీఆర్ ను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఇక ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ ను రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ఆహ్వానించేందుకు రేవంత్ తన ప్రతినిధులను పంపారు. వీరు కేసీఆర్ నివాసం నంది నగర్ కు వెళ్లి కేసీఆర్ ను ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించారు.
అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడం సహా రేవంత్ ను ఎదుర్కొనేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నా సీఎం మాత్రం ఆయనను వదలడం లేదు. కేసీఆర్ ను ఆవిర్భావ దినోత్సవానికి ఆహ్వానించేందుకు ఆయన మనుషులను పంపిన ఈ సంఘటన ఖచ్చితంగా కేసీఆర్ అహంకారాన్ని మరోసారి దెబ్బతీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.