Revanth Reddy : తెలంగాణలో హాస్పిటల్స్ దందాపై పడ్డ రేవంత్ రెడ్డి.. ఆ కుంభకోణం వెలుగులోకి.. 28 ప్రైవేట్ హాస్పిటల్స్ పై కేసు..

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy : రాష్ట్ర వ్యాప్తంగా 28 ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులపై తెలంగాణ నేర దర్యాప్తు విభాగం (సీఐడీ) విస్తృతంగా దాడులు నిర్వహించింది. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) లావాదేవీల్లో అవకతవకలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

దశాబ్ద కాలంలో సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల్లో గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నట్లు ఆడిట్ లో తేలడంతో సీఐడీ ఈ దాడులు ప్రారంభించింది. హాస్పిటల్ యాజమాన్యాలు ఏజెంట్ల సహకారంతో నకిలీ పత్రాలను సృష్టించి సీఎంఆర్ఎఫ్ నిధులను అక్రమంగా పొందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. స్పందించిన సీఐడీ సంబంధిత ఆసుపత్రుల యాజమాన్యాలపై కేసులు నమోదు చేసింది.

దర్యాప్తులో భాగంగా కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, మెదక్ సహా పలు జిల్లాల్లో సోదాలు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు ఆరు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఈ కుంభకోణం బయటపడడంతో తెలంగాణ మంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. తెలంగాణ సచివాలయంలోని రెవెన్యూ శాఖ (సీఎంఆర్ఎఫ్) సెక్షన్ ఆఫీసర్ (ఎఫ్ఏసీ) డీఎస్ఎన్ మూర్తి ఫిర్యాదు చేయడంతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

తెలంగాణలో వందలాది నకిలీ మెడికల్ బిల్లులు సీఎం కార్యాలయానికి (సీఎంవో) సమర్పించారు. రాష్ట్రంలో 28 ఆసుపత్రులను గుర్తించామని, ఈ ఆస్పత్రులపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేశామని సీఐడీ తెలిపింది. సీఐడీ అధికారులు త్వరలోనే వరుస అరెస్టులు చేసే అవకాశం ఉంది.

సీఐడీ సోదాలతో బిల్లుల్లో కుంభకోణం చేసిన హాస్పిటల్ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. తమ వంతు ఎప్పుడు వస్తుందో బిక్కు బిక్కుముంటున్నారు. అయితే వైద్యం చేయకుండానే రోగుల పేర్లతో మోసం చేసిన వారి పాత్ర గురించి ఆరా తీస్తున్నారు. మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీశ్ రావు వద్ద డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదవడంతో బీఆర్ఎస్ పార్టీ పాత్రపై పలు అనుమానాలు కలుగుతున్నాయి.

TAGS