Revanth Reddy:ప్రజాపాలన ఫామ్ రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. వచ్చిన వెంటనే బుధవారం కీలకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెప్ ఎన్నికల హామీల్లో భాగమైన ఆరు గ్యారంటీలకు సంబంధించిన `ప్రజాపాలన` అప్లికేషన్ ఫామ్‌ను తాజాగా సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విడుదల చేశారు. తెలంగాణ సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రజా పాలన లోగోతో పాటు ఈ దరఖాస్తు పత్రాన్ని విడుదల చేశారు.
ఢిల్లీ టూర్ ముగించుకుని నేరుగా సచివాలయానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ, మంత్రి కోమటిరెడ్డి వెంటకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిసెంబర్ 28 నుంచి ప్రజాపాలన ప్రారంభం అవుతున్న సందర్భంగా ఆరు గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్‌ని విడుదల చేశారు.
డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో 5 గ్యారంటీల లబ్దిపొందేందుకు ఈ అప్లికేషన్ ఫాంలో వివరాలు నింపి సంబంధిత అదికారులకు సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.