Revanth Reddy – NTV Chaudhary : తెలంగాణ రాజకీయాల్లో తనకు ఎదురు లేకుండా చేసుకునే పనిలో రేవంత్ రెడ్డి పడ్డాడు. ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణలో బలమైన గొంతుకగా ఉన్న మీడియాను తన కంట్రోల్ లోకి తెచ్చుకుంటున్నారు.
ఈ మేరకు ఇప్పటికే ఈనాడు రామోజీరావును, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను కలిసిన రేవంత్ రెడ్డి తాజాగా న్యూస్ చానెల్స్ లో నంబర్ 1గా ఉన్న ఎన్టీవీ ని కూడా మద్దతు కోరారు.
ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి ఇంటికి లంచ్‌కి వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఈ మేరకు ఆయనతో చర్చలు జరిపారు.
రాబోయే ఎన్నికల్లో సహకారం.. మీడియా మద్దతు సహా కీలక అంశాలు చర్చించారు. న్యూస్ చానెల్స్ లో నంబర్ 1గా ఉన్న ఎన్టీవీ మద్దతు కోసమే రేవంత్ రెడ్డి ఇలా స్వయంగా వెళ్లినట్లు తెలుస్తోంది.
తెలంగాణ మీడియాలో తనకు ఎదురు లేకుండా చేసుకునేందుకు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా మీడియా పెద్దలను కలుస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పది కాలాల పాటు కొనసాగించాలంటే మీడియా అవసరం చాలా కీలకం. అందుకే మీడియా పెద్దల మద్దతు కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.