Revanth Reddy:హ‌ట్ టాపిక్‌..సీఎం రేవంత్ రెడ్డి మాస్ ధ‌మ్కీ

Revanth Reddy:తెలంగాణ ఎన్నిక‌ల్లో ఏదైతే జ‌ర‌గ‌కూడ‌ద‌ని బీఆర్ఎస్ శ్రేణులు భావించాయో స‌రిగ్గా అదే జ‌రిగింది. ఈ ఎన్నిక‌ల్లో పొర‌పాటున కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించి అధికారంలోకి వ‌స్తే..సీఎంగా రేవంత్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయితే రంకు మొగుడుగా త‌గులుతాడ‌ని, త‌న‌దైన దూకుడుతో అధికారుల‌ని ప‌రుగులు పెట్టించ‌డ‌మే కాకుండా ప్ర‌తిప‌క్ష పార్టీని మూడు చెరువుల నీళ్లు తాగిస్తాడ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావించారు. స‌రిగ్గా తెలంగాణ‌లో ఇప్పుడు అదే జ‌రుగుతోంది.

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ విజ‌యాన్ని సాధించ‌డం, మ్యాజిక్ ఫిగ‌ర్ (60)ని మించి అసెంబ్లీ స్థానాల‌ని ద‌క్కించుకోవ‌డం, అప్ప‌టి వ‌రకు రెండేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు భంగ‌పాటు క‌ల‌గ‌డం తెలిసిందే. కాంగ్రెస్ అధికారం చేప‌ట్ట‌డంతో రెబ‌ల్ లీడ‌ర్‌గా పేరున్న రేవంత్ రెడ్డి అనూహ్యంగా ముఖ్యమంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. ప‌ద‌వీ ప్ర‌మాణ స్వీకారం చేస్తున్న రోజు ప్ర‌గ‌తిభ‌వ‌న్ గేట్లు బ‌ద్ద‌లు కొట్టించి త‌న‌దైన మార్కు దూకుడుతో ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తున్నారు.

వ‌రుస స‌మీక్ష‌ల‌తో అధికార యాంత్రాంగాన్ని ప‌రుగులు పెట్టిస్తున్న రేవంత్ రెడ్డి ఇటీవ‌ల అసెంబ్లీ స‌మావేశాల సాక్షిగా బీఆర్ఎస్ నేత‌ల‌పై విరుచుకుప‌డిన విష‌యం తెలిసిందే. భారాస అప్పుల కుప్ప‌గా రాష్ట్రాన్ని మిగిల్చింద‌ని, అప్పులు తెచ్చి కొప్పులు పెట్టార‌ని అసెంబ్లీ సాక్షిగా ఫైర్ అయ్యారు. స‌భ్యుల‌కు మేము వేసే శిక్ష ఒక్క‌టే స‌స్పెండ్ చేయ‌ము చ‌చ్చిన‌ట్టు మేము మాట్లాడేది అంతా వినాల్సిందే అంటూ కౌంట‌ర్లు వేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఉద్యోగుల‌కు రేవంత్ రెడ్డి మాస్ ధ‌మ్కీ ఇవ్వ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

ఉద్యోగులు స‌రైన విధంగా ప‌ని చేయాల‌న్నారు. గ‌త ప్ర‌భుత్వంలో ప‌ని చేసిన ఉద్యోగుల‌ను గాడిలో పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఒక లెక్క ఇప్పుడొక లెక్క అంటూ త‌న పంథా ఏంటో క్లియ‌ర్ క‌ట్‌గా స్ప‌ష్టం చేస్తున్నారు. అంతే కాకుండా ప్ర‌జ‌ల‌కు ఉద్యోగులు జ‌వాబుదారీగా ఉండాల‌న్నారు. పాల‌న‌కు సంబంధించిన విష‌యాల్లో దూకుడుగా ఉండాల‌ని అధికారుల‌కు సూచిస్తూనే త‌న మార్కు పాల‌న కోసం త‌హ‌త‌హ లాడుతున్నారు. అంతే కాకుండా త‌ప్పు చేసే వారిని ఎట్టిప‌రిస్థితుల్లో త‌ను ఉపేక్షించ‌న‌ని, క‌ఠినంగా శిక్షిస్తాన‌ని మాస్ ధ‌మ్కీ ఇవ్వ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవ‌ల క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌తో సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌త్యేక స‌మావేశాన్ని నిర్వ‌హించారు.అంతా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. ఫ్రెండ్లీ నేచ‌ర్ ఉండాలంటూనే త‌ప్పు చేస్తే ఎవ‌రినైనా వ‌ద‌ల‌న‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్ర‌భుత్వ‌ ప‌థ‌కాల ప‌ట్ల పార‌ద‌ర్శ‌కంగా ఉండాల‌న్నారు. అంతే కాకుండా నేరాలు, ఘోరాలు చేసే వారి ప‌ట్ల మాత్రం చాలా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. ఈ నేప‌థ్యంలోనే కొంత మంది ఉద్యోగుల ప‌నితీరు ప‌ట్ల తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసిన రేవంత్ రెడ్డి ఇక నుంచి వారి ప‌నితీరు మార్చుకోవాల‌ని హెచ్చ‌రించారు. రేవంత్ రెడ్డి మాస్ ధ‌మ్కీ ఇప్పుడు అధికార వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

TAGS