Revanth Reddy:మరి కొన్ని గంటల్లో కాంగ్రెస్ నేత ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్నాయి. ముందుగా అనుకున్న సమయం కాకుండా గురువారం మధ్యాహ్నం 1:04 గంటలకు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరాం చేయబోతున్నారు. ఇందు కోసం కాంగ్రెస్ పెద్దలని ఆహ్వానించడానికి రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అధిష్టానం కీలక నేతలను కలుస్తూ ఢిల్లీలో బిజీ బిజీగా గడిపేస్తున్నారు.
రేవంత్ రెడ్డి రాజీనామా…
మంగళవారం ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడి కాంగ్రెస్ ముఖ్య నేతలని కలుస్తూ వారిని తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ఇదే సందర్భంగా ఆయన పార్లమెంట్‌కు కూడా వెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. అలాగే పార్లమెంట్‌లో ఎంపీలను ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా రూమ్ నెంబర్ 66లో పలు పార్టీలకు చెందిన ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. తనని కలిసిన ఎంపీలు రేవంత్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
రేపు రజినీ ఉద్యోగ నియామకంపై సంతకం..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగం ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీ ప్రకారం రజినీ ఉద్యోగ నియామకంపై రేవంత్ సంతకం. ఆమెకు ప్రమాణ స్వీకారానాకి రావాలని రేవంత్ ఆహ్వానం.
సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలతో రేవంత్ భేటీ…
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో ప్రత్యేకంగా సమావేశమైన రేవంత్ రెడ్డి. గురువారం మధ్యాహ్నం జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని వారిని ప్రత్యేకంగా ఆహ్వానించిన రేవంత్ రెడ్డి. అనంతరం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో భేటీ. ఆయనని కూడా ప్రత్యేకంగా ఆహ్వానంచిన రేవంత్ రెడ్డి. ఇలా మంగళారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వివిధ నాయకులతో రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడిపారు.
Telangana CM designate Revanth Reddy meets Sonia Gandhi, Rahul Gandhi and Priyanka Gandhi Vadra in Delhi pic.twitter.com/hUuu2gl7bF
— ANI (@ANI) December 6, 2023