Revanth Reddy : రేవంత్ రెడ్డికి సీఎంగా ఈ దసరా పండుగ మధుర జ్ఞాపకంగా నిలిచింది. ముఖ్యమంత్రి హోదాలో తన సొంత ఊరిలో రేవంత్ రెడ్డి దసరా వేడుకలు జరుపుకున్నారు. సొంతూరిలో జరుపుకున్న తాలూకూ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు వికారాబాద్ జిల్లా కొండారెడ్డిపల్లి. దీంతో రేవంత్ రెడ్డి తన ఊరి ప్రజలు, బంధువులు, స్నేహితుల మధ్య విజయ దశమి వేడుకలు చేసుకున్నారు. తన ఊరి ప్రజలతో చాలా సరదాగా గడిపారు. ఒక్కొక్కరిని పేరుపేరునా పలకరిస్తూ అక్కడి ప్రజల బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
ఈ వీడియోను రేవంత్ రెడ్డి తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ గేమ్ చేంజర్ సినిమాలోని రా మచ్చ.. రా మచ్చ పాటను జత చేసి పోస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వీడియోను మెగా అభిమానులు కూడా షేర్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈ వీడియోతో పాటు కొన్ని భావోద్వేగ వ్యాఖ్యలు కూడా రాసుకొచ్చారు. “గంటలు క్షణాల్లా గడిచిపోయాయి.. అనుబంధాలు … శాశ్వతమై మిగిలాయి.. కొండారెడ్డిపల్లిలో… ఈ దసరా నా జీవన ప్రస్థానంలో… ఆత్మీయ అధ్యాయం” అని కోట్ చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఈ వీడియోకు ఇప్పటికే ఐదు లక్షలకు పైగా వ్యూస్ దాటాయి. ఈ వీడియో చిత్రీకరణకు డ్రోన్ కెమెరా ఉపయోగించారు. అలాగే రేవంత్ రెడ్డిపై పూల వర్షం కురిపించడం ఇందులో చూడవచ్చు. రేవంత్ ను చూడాడానికి తమ స్వగ్రామానికి చెందిన వాళ్లే కాకుండా సమీప గ్రామాల ప్రజలు కూడా తరలి వచ్చారు. రేవంత్ రెడ్డితో పాటు ఆయన మనవడు కూడా ఈ వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. రేవంత్ రెడ్డి తన మనవడిని భుజాలపై ఎక్కించుకొని ఊరంతా తిరిగాడు.
గంటలు క్షణాల్లా గడిచిపోయాయి.
అనుబంధాలు …
శాశ్వతమై మిగిలాయి.
కొండారెడ్డిపల్లిలో…
ఈ దసరా నా జీవన ప్రస్థానంలో…
ఆత్మీయ అధ్యాయం.#Dussehra #Dussehra2024 pic.twitter.com/1lPABSpZVq— Revanth Reddy (@revanth_anumula) October 13, 2024