JAISW News Telugu

Revanth Reddy:ఏఐసీసీ పెద్ద‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన రేవంత్‌రెడ్డి

Revanth Reddy:తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిని సీఎంగా ప్ర‌క‌టిస్తూ అధిష్టానం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నెల 7న రేవంత్‌రెడ్డి తెలంగాణ రెండ‌వ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలో త‌న‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రిగా ప్ర‌క‌టించిన ఏఐసీసీ పెద్ద‌ల‌కు రేవంత్ రెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఏఐసీసీ అధ్య‌క్షులు మ‌ల్లికార్జున ఖ‌ర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్‌, క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకె శివ‌కుమార్‌, మ‌నీక్ రావ్ ఠాక్రేతో పాటు అండ‌గా నిలిచిన కాంగ్రెస్ సైనికుల‌కు రేవంత్ రెడ్డి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

తెలంగాణ నూత‌న ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు కాంగ్రెస్‌జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేజీ వేణు గోపాల్ ప్ర‌క‌టించారు. తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ భేటీలో అందిన తీర్మానాన్ని ప‌రిశీలించిన అనంత‌రం సీఎంగా రేవంల్ రెడ్డిని పార్టీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే నిర్ణ‌యించార‌ని వెల్ల‌డించారు. సీఎల్పీ నేత‌గా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసిన‌ట్టు వెల్ల‌డించారు. తెలంగాణ సీఎల్పీ స‌మావేశంలో చేసిన మూడు తీర్మానాల‌ను ప‌రిశీల‌కులు పార్టీ అధ్య‌క్షుడికి అందించార‌ని వివ‌రించారు.

తెలంగాణ‌లో అఖండ విజ‌యాన్ని అందించిన ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానం మొద‌టిది కాగా, అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపేది రెండో తీర్మానం అన్నారు. ఇక మూడ‌వ‌ది అతి ముఖ్య‌మైన‌ది సీఎల్పీ నేత ఎంపిను అధిష్టానానికి వ‌దిలేస్తూ ఎమ్మెల్యేలు తీర్మానాన్ని ఆమోదించార‌ని కేసీ వేణుగోపాల్ వివ‌రించారు. రిపోర్ట్ ప‌రిశీలించిన త‌రువాత సీనియ‌ర్ల‌తో చ‌ర్చించామ‌ని, రేవంత్‌ని ముఖ్య‌మంత్రిని చేయాల‌ని పార్టీ నిర్ణ‌యించింద‌ని తెలిపారు.

Exit mobile version