Kishan Reddy : కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy
Kishan Reddy : కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సికింద్రాబాద్ టూరిజం ప్లాజాలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేశామని, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. సీఎం ఏ ముఖం పెట్టుకొని ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. అశోక్ నగర్ లైబ్రరీ వద్ద నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ను ప్రకటించలేదు. మరోవైపు ధాన్యం కొనుగోళ్లలో వైఫల్యం చెందిందన్నారు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుచేయలేదని విమర్శించారు.