Revanth Reddy Crushed Activist : ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. అధికారమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. ప్రజలు కూడా అధికార మార్పిడికి మొగ్గు చూపుతున్నారు. దీంతో బీజేపీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ముందంజలో నిలుస్తోంది. ఈ విషయం బీఆర్ఎస్ కు కూడా అర్థమైపోయింది. అందుకే వారు సైలెంట్ అయిపోయారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని కోసం సుడిగాలి పర్యటన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రజలకు వివరిస్తున్నారు. ఆరు పథకాలు పేదలకు ఉపయోగపడేవని గుర్తు చేస్తున్నారు. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ కి ఓసారి అవకాశం ఇవ్వాలని గట్టిగా అనుకున్నట్లు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డిని కలవడానికి వచ్చిన ఓ అభిమానిని చితక బాదారు. రేవంత్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా అతడిని పిచ్చిగా కొట్టారు. వీపు విమానం మోత మోగించారు. దీంతో అతడు లేవలేని స్థితిలో పడిపోయాడు. అతడు చేసిన నేరం ఏమిటి? కలవడానికి రావడం చేయకూడదా? రేవంత్ రెడ్డిని కలవకూడదా? అనే ప్రశ్నలు నేతలపై వస్తున్నాయి.
రేవంత్ రెడ్డిని కలవకూడదు. పార్టీ అంటే అభిమానం ఉండకూడదా? కలవడానికి రావడమే అతడు చేసిన నేరమా? వచ్చినందుకు వీపు సాపు చేయాలా? ఆ అభిమానిని మరీ అంత దారుణంగా గాయపరచాలా? పశువును కొట్టినట్లు కొట్టడం విమర్శలకు తావిస్తోంది. ఇది పార్టీకి మైనస్ అయ్యేలా ఉంది. ఎన్నికల సమయంలో ఇలాంటి దాడులకు తెగబడటం వారి స్థాయికి తగినది కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.