JAISW News Telugu

Breaking News:తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి

Breaking News:తెలంగాణ సీఎంగా టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి పేరుని ఏఐసీసీ ఖ‌రారు చేసింది. ఈ నెల 7వ తేదీన ఉద‌యం 10 గంట‌ల‌కు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ప్ర‌మాణ స్వీక‌రాం చేయ‌నున్నారు. డిసెంబ‌ర్ 5,6 తేదీలు మంచి రోజులు కాద‌ని ప్ర‌మాణ స్వీకారాన్ని 7వ తేదీకి వాయిదా వేశారు. 7వ తేదీన ఉద‌యం రేవంత్ రెడ్డితో పాటు పూర్తి స్థాయిలో మంత్రి వ‌ర్గం కొలువు తీర‌నుంది. ఈ రోజు ఉద‌యం నుంచి కాబోయే సీఎం ఎవ‌ర‌నే దానిపై తీవ్ర ఉత్కంఠ నెల‌కొన్న విష‌యం తెలిసిందే.

ఉద‌యం సీఎల్పీ స‌మావేశం జ‌రిగింది. సీఎల్పీ నేత‌ని ఎన్నుకునే క్ర‌మంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా ఏక వాక్య తీర్మానాన్ని చేయ‌డం, దాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పంపించ‌డం తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా అంగీక‌రించేది లేదంటూ సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కులు తీవ్ర వ్య‌తిరేక‌త‌ను వ్య‌క్తం చేశార‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లో అత‌న్ని సీఎంగా అంగీక‌రించేది లేద‌ని లే్చి చెప్పిన‌ట్టుగా వార్త‌లు వినిపించాయి. అయితే ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దే క్ర‌మంలో క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకె శివ‌కుమార్ రంగంలోకి దిగి ఈ విష‌యాన్ని ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేకు అప్ప‌గించారు.

వారు ఢిల్లీ వ‌చ్చిన త‌రువాతే సీఎంపై నిర్ణ‌యం:మాణిక్యం ఠాకూర్‌

పార్ల‌మెంట్ స్ట్రాట‌జీ క‌మిటీ పార్ల‌మెంట్‌లో అనుస‌రించాల్సిన ప్యూహాల‌పైనే చ‌ర్చ జ‌రిపిన‌ట్లు కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాకూర్ తెలిపారు. తెలంగాణ ఎమ్మెల్యేలు ఏఐసీసీ ప‌రిశీల‌కుల‌కు అథారైజేష‌న్ ఇచ్చార‌న్నారు. ప‌రిశీల‌కులు ఢిల్లీకి వ‌స్తున్నారు. వారు అధిష్టాన పెద్ద‌ల‌తో భేటీ అవుతారని చెప్పారు. ప‌రిశీల‌కులు ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గేకి నివేదిక ఇస్తారన్నారు. ఎవ‌రు సీఎం అనేది అధ్య‌క్షుడు నిర్ణ‌యం తీసుకుంటార‌ని మాణిక్యం ఠాకూర్ తెలిపారు.

Exit mobile version