Mallu Ravi : మరో పదేళ్లపాటు సీఎంగా రేవంత్ రెడ్డి: మల్లు రవి

Mallu Ravi
Mallu Ravi : మరో పదేళ్ల పాటు సీఎంగా రేవంత్ రెడ్డి కొనసాగుతారని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై మహేశ్వర్ రెడ్డి మాట్లాడిన తీరు అతని రాజకీయ అజ్ఞానానికి పరాకాష్ఠ అని పేర్కొన్నారు. మహేశ్వర్ రెడ్డికి బీజేపీలో పని ఏమీ లేక పగటి కలలు కంటూ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేస్తున్నారంటూ.. మల్లు రవి ఓ ప్రకటన విడుదల చేశారు. బీజేపీలో రోజురోజుకూ ముదిరిపోతున్న విభేదాలు, వర్గపోరు నుంచి అందరి దృష్టిని మరల్చేందుకు ఇలాంటి జాతకాలు చెబుతున్నారని దుయ్యబట్టారు.