Revanth Reddy : ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, కేటీఆర్

Revanth Reddy
Revanth Reddy and KTR : తెలంగాణ రాష్ట్రానికి చెందిన అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల ముఖ్య నేతలు ఒకే వేదికపై కనిపించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాజకీయంగా భిన్న దృవాల్లో ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇరువురు నేతలు కలిసి రావడం విశేషం. డీలిమిటేషన్ వల్ల దక్షిణ రాష్ట్రాలకు జరిగే నష్టంపై చెన్నైలో జరిగిన డీఎంకే ఆధ్వర్యంలోని సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.