JAISW News Telugu

MLC Kavitha : రేవంత్ రేసుగుర్రం కాదు.. కీలుగుర్రం.. తెలంగాణను రేవంత్ ఎడారి చేస్తున్నారు?  కవిత సెటైర్లు..

BRS Kavita

MLC Kavitha

MLC Kavitha : రేవంత్ ఇటీవల చేసిన కరువు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి వ్యాఖ్యాలు చేసింది. తెలంగాణలో సరిపోయినన్ని నీరు ఉన్నా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఉన్న వాటిని వదలడం లేదని మండిపడ్డారు.

రేవంత్ వ్యవహార శైలి చూస్తుంటే రాష్ట్రాన్ని ఎడారిగా మార్చేచేందుకే కంకణం కట్టుకున్నట్లు ఉన్నారు అంటూ కవిత తీవ్రంగా అసహనం వ్యక్తం చేసింది. రేవంత్ రేసుగుర్రం కాదు, కీలుగుర్రం అంటూ సంచలన ఆరోపణలు చేసింది. రేవంత్ రెడ్డి డీఎన్ఏలోనే బీజేపీ ఉందని వ్యాఖ్యలు చేసింది. తాము ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం లేదు. బీజేపీనే ఆ పని చేస్తుందంటూ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గురుకుల విద్యార్థుల సూసైడ్లపై సమీక్ష లేదని, ఉద్యోగాల రిజర్వేషన్లలో రోస్టర్ విధానం తెచ్చారని కవిత వ్యాఖ్యానించారు. మహిళా వ్యతిరేకిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ముద్రపడే అవకాశం ఉందన్న కవిత మహిళా రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదం ఉందని వ్యాఖ్య చేశారు.

మొన్న ఇచ్చిన ఉద్యోగాల్లో ఎంత మంది మహిళలు ఉన్నారో చెప్పాలని కవిత రేవంత్ ను బహిరంగంగా ప్రశ్నించారు. పాత జీవో రద్దు చేసి కొత్తది ఇస్తున్నారన్నారు. కేసీఆర్ నియంత అని చెప్పిన మేధావులు రేవంత్ ఉద్యోగాల రిజర్వేషన్లపై చేస్తున్న కుట్రలను ఎందుకు ప్రశ్నించడం లేదో? చెప్పాలని నిలదీశారు.

మేధావులు మౌనంగా ఉండడం అత్యంత ప్రమాదకరం. దీక్షలు చేసేందుకు అనుమతిస్తామని చెప్పిన ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అనుమతి ఇవ్వకపోతే న్యాయస్థానంకు వెళ్లి మరీ అనుమతులు తెచ్చుకొని బతుకమ్మలాడిన చరిత్ర ఉందని కవిత పేర్కొన్నారు.

Exit mobile version