JAISW News Telugu

CM Revanth : ఏపీ రాజకీయాలకు దూరంగా రేవంత్..! ఆ సామాజికవర్గం కనుసన్నల్లోనే తెలంగాణ సీఎం!!

Revanth away from AP politics.

Revanth away from AP politics..

CM Revanth : మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై ఎన్నికల కమిషన్ (ఈసీ) కూడా కసరత్తు చేస్తుంది. నేడో, రేపో  షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రమైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అందరి దృష్టి పడింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబుకు నాయుడి ప్రియ శిష్యుడు. టీడీపీలో చాలా కాలం పని చేసిన నేత కాబట్టి ఆయన ఎవరికి మద్దతిస్తారన్న విషయంపై ఏపీలో చర్చ జరుగుతోంది.

ఈ చర్చల నేపథ్యంలో రేవంత్ రెడ్డి గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తాను ఎక్కడ ఉన్నా ‘కాంగ్రెస్ కోసమే పని చేస్తానని, ఇతర పార్టీల గురించి పట్టించుకోనని’ అన్నారు. ఇది రాజకీయంగా చూసుకుంటే కరెక్ట్ స్టేట్మెంటే.. కానీ, ఆయన ఏపీ రాజకీయాలకు దూరంగా ఉండే కారణం మరొకటి ఉంది. రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ సీఎంగా కొనసాగుతున్నారు. పొరుగు రాష్ట్ర రాజకీయాల్లో తలదూరిస్తే ఇబ్బందులు తప్పవు. అందుకని ఎక్కువ కాలం తన పదవిని కాపాడుకోవాలని అనుకుంటున్నారు.

ఇప్పుడు ఏపీలో టీడీపీకి మద్దతిస్తే తెలంగాణలో రెడ్డి సామాజికవర్గం ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. తెలంగాణలోని రెడ్డి సామాజికవర్గం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకతతో కాంగ్రెస్ కు ఓటేసి రేవంత్ ను సీఎంగా గెలిపించుకున్నారు. ఆయన ఏపీ రాజకీయాల్లో తల దూరిస్తే అది కొందరు రెడ్డి ఓటర్లను కలవరపెడుతుందని, ఇది భవిష్యత్ లో తన పదవికి హానికరమని అంటున్నారు.

2014లో రెడ్డి టీడీపీకి వ్యతిరేకంగా తెలంగాణలో బీఆర్ఎస్ కు ఓటేశారు. తెలంగాణలో రెడ్డి సామాజికవర్గంలో రేవంత్ బలం ఉండడంతో మళ్లీ అదే జరగవచ్చు. రేవంత్ తెలివి తేటలను పరిగణనలోకి తీసుకుంటే ఆయన ఏ రకంగానూ ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోరని ఇన్ సైడర్లు చెబుతున్నారు.

Exit mobile version