JAISW News Telugu

Mega DSC : డీఎస్సీ వాయిదా కుదరదన్న రేవంత్ సర్కార్..యథావిధిగానే పరీక్షలు

Mega DSC

Mega DSC

Mega DSC : డీఎస్సీ వాయిదాకు రేవంత్ సర్కార్ కుదరని తేల్చిచెప్పింది. తెలంగాణలో ఈ ఏడాది ఫిబ్రవరిలో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 11,062 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జూన్ 20తో ముగిసింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ పరీక్షల తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. అయితే టీచర్ అభ్యర్థులు గత కొన్ని రోజులుగా డీఎస్సీ పోస్టులు పెంచాలని.. పరీక్షలను వాయిదా వేయాలని ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విద్యాశాఖ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ పై కీలక నిర్ణయం తీసుకుంది.  

తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. అభ్యర్థులు ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది. అయితే ఇటీవలే టెట్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. టెట్‌కు, డీఎస్సీకి భిన్నమైన సిలబస్ ఉండటంతో ప్రిపరేషన్ కు సమయం సరిపోవడం లేదని డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు సోమవారం ఉదయం లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఈ నేపథ్యంలోనే డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని సర్కార్ ప్రకటించింది. మొదటిసారిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీఆర్‌టీ) విధానంలో నిర్వహించనున్నారు. రోజుకు రెండు షిఫ్టుల్లో డీఎస్సీ పరీక్షలు జరుగనున్నాయి.

టీఎస్‌ డీఎస్సీ 2024 పరీక్షల షెడ్యూలు:
జులై 18న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, రెండో షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారు.
జులై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
జులై 20న ఎస్జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు
జులై 22న స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష
జులై 23న సెకండరీ గ్రేడ్ టీచర్స్ పరీక్ష
జులై 24న స్కూల్ అసిస్టెంట్ – బయలాజికల్ సైన్స్ పరీక్ష
జులై 25న స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఉర్దూ, మరాఠీ పరీక్షలు
జులై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
జులై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష.
ఆగస్టు 5 వరకు మిగతా పరీక్షలను నిర్వహించనున్నారు.

Exit mobile version