PM Modi : ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ప్రధానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు కొన్ని ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు.
సభలో ప్రధాని కుడి పక్కన గవర్నర్, ఎడమ వైపున సీఎం రేవంత్ రెడ్డి కూర్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని సీఎంతో మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో ఫుల్ వైరల్ అయ్యింది. మోడీ సీఎం రేవంత్ తో ఏం మాట్లాడి ఉండవచ్చన్న చర్చ రాష్ట్రంలో కొనసాగుతోంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రధాని మోడీని కలిసేందుకు సీఎం కేసీఆర్ ఇష్టపడలేదు. రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వంకు సంబంధించి ముఖ్యమంత్రి అయినా.. ప్రొటోకాల్ పాటిస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానికి స్వాగతం పలుకుతున్నారని కాంగ్రెస్ శ్రేణులే చెప్తున్నాయి. కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే రాష్ట్రానికి నిధులు తీసుకువస్తానని సీఎం సభలో చెప్పారు.
ఆదిలాబాద్ నుంచి మోడీ రాత్రికి హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం రాత్రి రాజ్‌భవన్‌లో బస చేస్తారు. మంగళవారు సంగారెడ్డిలో పర్యటిస్తారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. పర్యటన తర్వాత ఒడిశాకు బయల్దేరి వెళ్తారు. మోడీ తెలంగాణలో పర్యటించిన 2 రోజుల్లో రూ. 15,718 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ప్రధాని పర్యటించనున్న ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీస్ బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. అధికారిక, పార్టీ కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ప్రధాని వస్తుండడంతో ఘన స్వాగతం పలికేందుకు రేవంత్ సర్కారు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. రాజకీయంగా రెండు పార్టీల సిద్దాంతాలు వేరైనప్పటికీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రంతో కోట్లాడి నిధులు తెచ్చుకుంటామని రేవంత్ తెలిపారు.
LIVE: PM Modi inaugurates, dedicates & lays foundation stone of projects in Adilabad, Telangana https://t.co/UIYWqzEI7v
— G Kishan Reddy (Modi Ka Parivar) (@kishanreddybjp) March 4, 2024