JAISW News Telugu

Police dharna : రేవంత్ డౌన్ డౌన్.. బెటాలియన్ పోలీసుల ధర్నా

Police dharna

Police dharna

police dharna : తెలంగాణ పోలీసులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులపై తాజాగా పోలీసు సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బెటాలియన్ పోలీసులు సీఎం రేవంత్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద నాగార్జున సాగర్ హైవేపై బెటాలియన్ పోలీసు కుటుంబాలకు, స్థానిక పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఇక, మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా ఉధృతంగా మారడంతో సాగర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జాం అయింది.

వరంగల్ జిల్లాలోని మామునూరులో 4వ బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆందోళన చేపట్టారు. మామునూరు బెటాలియన్ కమాండెంట్ ఆఫీస్ వద్ద బైఠాయించి నిరసనకు దిగారు.

నల్లగొండలోని అన్నెపర్తి 12వ బెటాలియన్ లో సిబ్బంది మరోసారి నిరసన వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబును వెంటనే సస్సెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఆందోళన చేస్తున్న తమతో పాటు తమ కుటుంబ సభ్యుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ కానిస్టేబుల్స్ ఆరోపించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున నినాదాలు చేస్తూ బెటాలియన్ నుంచి రోడ్డుపైకి ర్యాలీగా వస్తున్న సిబ్బందిని పోలీసులు అడ్డుకున్నారు. గేట్లు వేయడంతో కానిస్టేబుల్స్ భార్యలు బయటకు రాకుండా ఆగిపోయారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 17వ బెటాలియన్ కమాండెంట్ ఆఫీస్ దగ్గర పోలీసులు ధర్నాకు దిగారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణలో ఒకే పోలీసు విధానం ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు డ్యూటీలు వేసి మా కుటుంబానికి దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాతో కూలీ పనులు, చెత్త ఏరే పనులు, మట్టి పనులు చేయిస్తున్నారు. అలాగే, పెద్ద అధికారుల ఇళ్లలో పాచిపనులు, బోల్లు తోమడం, ఇళ్లు ఊడ్వడం, పిల్లలను స్కూల్ కు పంపండం, మందు తాగి పబ్బులో పడిపోతే తీసుకురావడం లాంటి వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆరోపించారు. మాపై ఆంధ్ర అధికారులు పెత్తనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రోడ్డెక్కిన కానిస్టేబుల్స్ భార్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version