Shamshabad Airport : శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలను యథావిథిగా కొనసాగిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ లో తలెత్తిన సాంకేతిక సమస్య పరిష్కారమైంది. దీంతో విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. సాంకేతిక సమస్య కారణంగా ఇప్పటికే కొన్ని విమాన సర్వీసులు రద్దయిన విషయం తెలిసిందే. వాటిలో వెళ్లాల్సిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏ విధమైన ప్రత్యామ్నాయం కల్పించాలనే విషయంపై విమానయాన సంస్థలు ఆలోచిస్తున్నాయి.
నిన్న (శుక్రవారం) మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ క్రౌడ్ స్ట్రైక్ సమస్య ఏర్పడింది. ఫలితంగా పలు సాఫ్ట్ వేర్ సంస్థలతో పాటు బ్యాంకుల సేవలు, విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇండియాలో కూడా సమస్య ఏర్పడింది. ఇండియాకు చెందిన పలు ఎయిర్ లైన్స్ ఇండిగో, ఆకాశ, స్పైస్ జెట్ విమానాలు శుక్రవారం ఉదయం నుంచి నిలిచిపోయాయి.