JAISW News Telugu

NTR Bharosa : పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్ధరణ

NTR Bharosa

NTR Bharosa

NTR Bharosa : ఆంధ్రప్రదేశ్ లో  పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరును తొలగించి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్ధరణ చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.ఇకపై ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పేరుతో ఏపీలో పెన్షన్ల స్కీం చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయనుంది. రూ.3 వేలుగా ఉన్న పెన్షన్ ను రూ.4 వేలకు పెంచేశారు. అలాగే వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళ, డప్పు కళాకారులు, ట్రాన్స్ జెండర్ వంటి వారికి పెంచిన రూ.4 వేల పెన్షన్ అందించనున్నారు.

అలాగే దివ్యాంగులకు రూ. 3 వేల నుంచి రూ. 6 వేలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. పూర్తిస్థాయి దివ్యాంగులకు ఇచ్చే రూ.5 వేల నుంచి 15 వేలకు పెచినట్లు వెల్లడించింది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవారికి రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెన్షన్ ను పెంచింది. అలాగే మంచానికే పరిమితమైన వారికి రూ.5 వేల నుంచి 15 వేలకు పెన్షన్ పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులను జారీ చేశారు.

Exit mobile version