Nitish Kumar : కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయే పార్టీ మోదీ ప్రభుత్వానికి గట్టి మెలిక పెట్టింది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా కాకముందే తమ డిమాండ్లకు తెరతీసింది. తమ రాష్ట్రం బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగింది. ఈ మేరకు పార్టీ సమావేశంలో దీనిపై తీర్మానం చేసింది.
జనతాదళ్ (యునైటెడ్) జాతీయ కార్యవర్గ సమావేశం శనివారం నిర్వహించారు. అందులో బీహార్ కు ప్రత్యేక హోదా లేదా ఆర్థిక ప్యాకేజీని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీసుకొచ్చిన తీర్మానాన్ని పార్టీ ఆమోదించింది. దీంతోపాటు ప్రశ్నపత్రాల లీకేజీ కేసుల్లో నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. పరీక్షల్లో అక్రమాలను నివారించేందుకు పార్లమెంటులో ప్రత్యేక, కఠిన చట్టం చేయాలని కోరింది. ఈ సమావేశంలో పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సీనియర్ నేత సంజ్ ఝాను ఎన్నుకున్నారు.