JAISW News Telugu

KTR : కేటీఆర్ పై రాజీనామా ఒత్తిడి ???

KTR

KTR

KTR : గులాబీ నేతలు పదేళ్ల పాటు అధికారంలో కొనసాగారు. పదేళ్ల కాలంలో కేసీఆర్ నుంచి మొదలు కొని జిల్లా అధ్యక్ష భాద్యతలు చేపట్టిన ప్రతి ఒక్కరు మంచి వాళ్లే అయ్యారు. ఇప్పుడు అధికారం పోయి పార్టీ శ్రేణులు రోడ్డున పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గోరపరాజయాన్ని మూటగట్టుకుంది. ఉద్యమాల పార్టీ ఇంటికె పరిమితమై పోయింది.

ఈ నేపథ్యంలో పార్టీ ఓటమి చెండానికి కారణాలు ఏమిటి. ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది. లోపం ఎక్కడ జరిగింది. పటిష్టమైన నాయకత్వం ఉన్నప్పటికీ అధికారం ఎందుకు కోల్పోవలసి వచ్చింది. అనే అంశాలపై నేటివరకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతల్లో ఉన్న కేటీఆర్ సమీక్ష, సమావేశాలు నిర్వహించక పోవడంపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

ఒకవైపు అసంతృప్తి మొదలైన నేపథ్యంలోనే పార్టీ కి పార్లమెంట్ ఎన్నికల వేడి తగిలింది. అప్పటికే ఎన్నిలకల్లో ఓటమి చెందినవారు, గెలిచిన వారు కండువాలు మార్చుకుంటున్నారు. పార్టీని ఎలాగయినా కాపాడుకోవాలని పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కేటీఆర్ తో పాటు హరీష్ రావ్ లు రంగంలోకి దిగారు. కానీ అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటు కాషాయం దళాన్ని ఎదుర్కోవడం సాధ్యం కాలేదు. దింతో అధినేత కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టారు. అయన ప్రచారానికి జనం మాత్రం ఎదో ఒక పద్ధతి ప్రకారమైతే వచ్చారు. అయినా పార్టీ అభ్యర్థులు అందనంత దూరంలోకి వెళ్లి పోయారు.

వరుస ఓటములతో కుంగిపోయిన పార్టీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకల తయారైనది. పార్టీ కి మరి కొద్దీ రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల కోసమైనా పార్టీ కి చికిత్స చేసే అవసరం కనబడుత లేదని పార్టీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నారు. పార్టీని కాపాడుకోడానికి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటిఆర్ సమావేశాలు నిర్వహించక పోవడంతో శ్రేణులు గుర్రుగా ఉన్నారు. నేరుగా చెప్పలేక గౌరవంగా వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పుకుంటే మీకు పార్టీలో గౌరవం ఉంటుందంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు బిఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ కు  సుతి మెత్తగా చురకలు అంటించడం విశేషం.

Exit mobile version