Home Minister Anitha : జగన్ పై ఇంకా ప్రేమ ఉంటే రాజీనామా చేయండి: ఏపీ హోంమంత్రి అనిత

Home Minister Anitha
Home Minister Anitha : జగన్ పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగాలకు రాజీనామా చేసి ఆ పార్టీ కోసం పని చేసుకోవాలని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత హితవు పలికారు. సింహాచలంలో స్వామివారిని ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అనిత మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవి వచ్చిన తర్వాత అప్పన్న స్వామిని దర్శించుకోవాలని వచ్చనట్లు తెలిపారు. సింహాచలం భూములు ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాకుండా చూస్తానన్నారు. పంచగ్రామాల భూ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆమె చెప్పారు.
వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది పోలీసు అధికారులు ఆ పార్టీ నేతలకు తొత్తులుగా పనిచేశారని మంత్రి అనిత విమర్శించారు. ఇప్పటికి వారిలో అదే విధానంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జగన్ పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ పార్టీ కోసం పనిచేసుకోవాలని హితవు పలికారు. శాంతి భద్రతల విషయంో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ముఖ్యంగా మహిళలకు అన్యాయం జరగకుండా చూస్తానని పేర్కొన్నారు.