BSNL : టెలికాం రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్ మాత్రం పాత చింతకాయ పచ్చడిలా అదే దారిలో వెళ్తోంది. దీంతో ప్రైవేటు టెలికాం సంస్థలు వ్యాపారంలో దూసుకుపోతున్నాయి. కనీసం 4జీ సేవలు కూడా అందుబాటులోకి తీసుకురాకపోవడంతో ప్రైవేటు టెలికాం సంస్థలతో పోటీపడలేకపోతోంది వినియోగదారులను ఆకట్టుకోలేకపోతోంది. ఫలితంగా వ్యాపారరంగంలో వెనకే ఉంటోంది.
ఇంతవరకు బీఎస్ఎన్ఎల్ నుంచి ఇతర నెట్ వర్క్ లకు వెళ్లిన వారి సంఖ్య 22,20,654 కాగా సెప్టెంబర్ లో ఆ సంఖ్య 23,26,751 కి పెరిగింది. 2022 నుంచి సుమారు 77 లక్షల మంది ఇతర నెట్ వర్క్ లకు మారారు. దీంతో బీఎస్ఎన్ఎల్ మనుగడ ప్రశ్నార్థకంలో పడిపోతోంది. 4జీ ఏర్పాటు పనులు 2024 అక్టోబర్ నాటికి పూర్తవుతాయని చెబుతున్నారు. అందుకే కస్టమర్లు ఇతర నెట్ వర్కులకు వెళ్తున్నారు.
ప్రైవేటు టెలికాం సంస్థలు 5జీ సేవలు విస్తరిస్తుండటంతో బీఎస్ఎన్ఎల్ కనీసం 4జీ సేవలు కూడా అందించడం లేదు. ఈ నేపథ్యంలో యూనియన్ నాయకులు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు లేఖ రాశారు. బీఎస్ఎన్ఎల్ ను కాపాడాలని కోరారు. సేవలు అందించడంలో బీఎస్ఎన్ఎల్ ఇలాగే ఉంటే భవిష్యత్ లో కంపెనీ మూసుకోవడం ఖాయంగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే సంస్థను కాపాడాలని వారు మంత్రిని కోరారు.
రెండు వారాల్లో 4జీ సేవలు, డిసెంబర్ నాటికి 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయంటున్నారు. దీంతో గత ఏడాది మంత్రి చేసిన ప్రకటనతో యూనియన్ నేతలు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు ట్రయల్ కూడా వేయకపోవడంతో అనుమానాలు వస్తున్నాయి. 4జీ, 5జీ సేవలు అందుబాటులోకి రావాలంటే మరికొంత కాలం పట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.