Renu Desai : పవన్ ను మిస్సవుతున్న రేణుదేశాయ్… నా భర్త నాకే కావాలంటే పోస్ట్

Renu Desai

Renu Desai – Pawan Kalyan

Renu Desai : రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాలకు దూరం అయిన తర్వాత ఆమె సోషల్ మీడియాకు పరిమితం అయ్యారు. ఇటీవల  పవన్ కల్యాణ్‌పై ఆమె వరుస పోస్టులు పెడుతున్నారు.  పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తరువాత రేణు దేశాయ్‌ తన ఇద్దరి పిల్లలతో పుణేలో ఉంటున్నారు.  అయినా సోషల్ మీడియాలో నిత్యం తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు.  రేణు దేశాయ్‌ గతంతో పోలిస్తే ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా హల్ చల్ చేస్తున్నారు.  పవన్ అభిమానులు రేణు దేశాయ్‌ను టార్గెట్ చేసుకుని కామెంట్లు చేస్తున్నారు.  వారికి తనదైన రీతిలో ఆమె కూడా కౌంటర్ వేస్తూనే ఉన్నారు.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో రేణు దేశాయ్‌ను టార్గెట్ చేసుకుని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేశారు. దీనిపై ఆమె మాట్లాడుతూ పవన్ నన్ను వదిలేశారు కానీ..నేను కాదంటూ అభిమానులకు గట్టి కౌంటరిచ్చారు. ఇక కొడుకు అకీరాను పవన్ కళ్యాణ్ 2 (PK 2) అంటూ ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటున్నారు.

అంతేకాదు తొందరగా హీరో అయిపో అన్న అని ఒకరు, ఎడిటర్ అవ్వమంటూ మరొకరు కామెంట్స్ చేస్తున్నారు.  అయితే దీనిపై రేణు దేశాయ్ పవన్ ఫ్యాన్స్‌పై మండిపడుతున్నారు. ఆకీరాకు కానీ ఆయన తండ్రి పవన్ కు కానీ జూనియర్ పవన్ కళ్యాణ్ అని పిలిపించుకోవడం ఇష్టముండదు. మీ ఫీలింగ్స్‌ను అకీరా మీద బలవంతంగా రుద్దకండి అంటూ పవన్ అభిమానులు చేసిన కామెంట్లకు రేణు రిప్లై ఇచ్చారు.  ఇదిలా ఉంటే రేణు దేశాయ్ తాజాగా తన ఇన్‌స్టా లో ఓ వీడియో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలో తన మాజీ భర్త పవన్‌ కల్యాణ్‌ను ఆమె గుర్తు చేసుకున్నారు.. ”నా ఐఫోన్‌లో భోగి మంటను స్లో మోషన్‌ను చిత్రీకరించాను. డిసెంబర్ నుండి దానిపై ట్రిప్ చేస్తున్నాను. నేను ఇంకా ఇన్‌స్టాలో షేర్ చేయలేదని మర్చిపోయాను. నేను నా మాజీ భర్తను ఎలా తిరిగి పొందాలి లేదా నేను అతడిని ఇప్పటికీ కోల్పోతున్నానని మీరు భావించినందున నేను ఈ పోస్ట్ ఎలా ఉంచాను అనే దానిపై ఏవైనా అవాంఛనీయ సలహాలు లేదా వ్యాఖ్యలు చేస్తే డిలీట్ చేస్తాను లేదా బ్లాక్ చేస్తాను” అంటూ రాసుకొచ్చింది. రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట్లో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

TAGS