Renu Desai : రేణు దేశాయ్ కూతురుతో డ్యాన్స్ అదరగొట్టిందిగా..
Renu Desai : రేణు దేశాయ్ కూతురు ఆద్య, అకిరా నందన్ గురించి అందరీ తెలిసిందే.. అయితే రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తను ఏం చేస్తుందనే వివరాలతో యాక్టివ్ గా ఉంటుంది. ఏం పనులు చేసిన వాటిని అభిమానులతో పంచుకుంటుంది. ఇలా రేణు దేశాయ్ ఫ్యాన్స్ మధ్యనే గడుపుతూ ఉంటుందంటే నమ్మశక్యంగా ఉండదు.
పవన్ కల్యాణ్ తో విడిపోయిన తర్వాత కొన్ని రోజుల వరకు రేణు దేశాయ్ పై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత వాటిని ధీటుగా ఎదుర్కొని ముందుకు సాగారు. పవన్ కుటుంబ సభ్యులతో రేణు దేశాయ్ కలవకున్నా.. పిల్లలను మాత్రం మెగా ఇంట్లో ఏ పండగ జరిగినా.. ఫంక్షన్ జరిగినా పంపిస్తుంది. హిరోయిన్ గా వర్క్ చేసినా రేణుకు డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం.. అయితే తను తన కూతురు ఆద్య తో డ్యాన్స్ చేసిన వీడియోను పోస్టు చేసింది. దీంతో బోలెడన్నీ లైక్ లు, కామెంట్లు వచ్చి పడుతున్నాయి.
రేణు దేశాయ్, ఆద్య కలిసి డ్యాన్స్ చేస్తుండగా.. మొదట్లో వీడియోలో ఆద్య ను చూపించలేదు. కానీ ఆ తర్వాత వీడియో చివర్లో నాకు డ్యాన్స్ పార్ట్ నర్ దొరికింది అంటూ చెబుతూ ఆద్య పేస్ రివీల్ చేసింది. దీంతో మెగా, పవన్ అభిమానులు తెగ సంబరాలు చేసుకున్నారు.
రేణు దేశాయ్ పవన్ తో విడాకుల తర్వాత వేరే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఉంగరాలు ఎక్స్ చేంజ్ చేసుకున్న ఫోటోను సైతం సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కానీ ఆ తర్వాత ఎమైందో ఏమో పెళ్లి చేసుకోలేదు. మొదట్లో రేణు పెళ్లిపై చాలా రూమర్స్ కూడా వచ్చాయి. రేణు దేశాయ్, పవన్ కల్యాణ్ పిల్లలిద్దరూ రేణు వద్దే పెరుగుతున్నారు. ఆద్యను చూసి చాలా మంది అచ్చం నానమ్మ లాగే ఉంటుందని చెబుతున్నారు. అఖిరా నందన్ మాత్రం మ్యూజిక్ అంటే ఇష్టంతో విదేశాల్లో చదువుకుంటూనే మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు.
View this post on Instagram