Renu Desai:`యానిమల్` సినిమాపై రేణు దేశాయ్ పోస్ట్..కానీ ఓ ట్విస్ట్
Renu Desai:రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా నటంచిన ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ `యానిమల్`. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించారు. టిసిరీస్ వారితో కలిసి ప్రణయ్ రెడ్డి వంగ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 1న వర్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన ప్రతి సెంటర్లోనూ రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి హీరో రణ్‌బీర్ కపూర్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన సినిమాగా నిలిచింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ మూవీలో సీనియర్ నటుడు అనిల్ కపూర్, బాబీ డియోల్, సురేష్ ఓబెరాయ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ రీసెంట్గా ఈ సినిమాపై రివ్యూ ఇచ్చేసి సందీప్ రెడ్డి వంగ షాక్ ఇచ్చాడని ప్రశంసించారు. త్రిష కూడా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
తాజాగా ఈ జాబితాలో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ చేరారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన `యానిమల్` ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. హింసను తీవ్ర స్థాయిలో చూపించినప్పటికీ ఈ సినిమా తమకెంతో నచ్చిందని పలువురు ప్రముఖులు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో స్త్రీని తక్కువ చేసి చూపించారని కొంత మంది విమర్శలు చేస్తున్న వేళ రేణూ దేశాయ్ ఈ మూవీపై స్పందించింది.
ఈ మేరకు సోషల్ మీడియా ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు తనకెంతో నచ్చాయన్నారు. `ఎట్టకేలకు నిన్న `యానిమల్` చిత్రాన్ని చూశాను. అందులోని యాక్షన్ సీక్వెన్స్‌లు నాకెంతో నచ్చాయి. మీరు ఏదైనా కాస్త భిన్నంగా చూడాలనుకుంటే థియేటర్లో ఈ సినిమాను చూడటం మిస్ కావద్దు` అని రేణూ దేశాయ్ తెలిపారు. అయితే ఈ పోస్ట్‌కు మాత్రం కామెంట్ సెక్షన్‌ని క్లోజ్ చేశారు.ఇటీవల ఈ సినిమా విషయంలో త్రిషకు ఎదురైన విమర్శలని దృష్టిలో పెట్టుకుని రేణూ దేశాయ్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని పలువురు అభిప్రాయ పడుతున్నారు.