Rent House Vs Own House : ప్రతి ఒక్కరు జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు. ఆ దిశగా అడుగులు వేస్తారు. కానీ అది అందరికి సాధ్యం కాదు. కొందరు ఎంతో సంపాదిస్తారు. కానీ సొంతిల్లు కట్టుకోవడానికి పరిస్థితులు అనుకూలించవు. దీంతో అద్దె ఇంట్లోనే నివసిస్తుంటారు. ఈనేపథ్యంలో చాలా మంది అద్దె ఇళ్లలోనే కాలం వెళ్లదీస్తుంటారు. ఉద్యోగ రీత్యానో ఇతర కారణాల వల్లనో అద్దె ఇంట్లోనే ఉంటున్నారు.
ఎన్ని లక్షలు ఖర్చయినా సొంతిల్లు నిర్మించుకోవాలని అనుకుంటారు. ఇంటి స్థలం దొరకకపోతే ఇల్లునైనా కొనుక్కుంటారు. పక్కా వాస్తు ప్రకారం ఉన్న ఇల్లును చూసి కొనుగోలు చేయడం పరిపాటే. ఈక్రమంలో సొంతింటి కల నెరవేర్చుకోవడం జరుగుతుంది. కానీ కొందరి జాతకంలో సొంతింటి కల సాకారం చేసుకునే వెసులుబాటు ఉండదు. దీంతో వారు జీవితాంతం అద్దె ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది.
సొంతింటి కన్నా అద్దె ఇల్లే సౌకర్యంగా ఉంటుందని కొందరు భావిస్తుంటారు. నెల నెల తక్కువ మొత్తంలో అద్దె చెల్లించి ఉండటంతో ఎలాంటి అప్పులు లేకుండా చూసుకోవచ్చు. వాస్తు సరిగా లేదనుకుంటే ఇంకో ఇల్లు చూసుకునే సదుపాయం ఉంటుంది. దీంతో అద్దె ఇల్లు చూసుకుని ఉంటే ఎలాంటి ఈఎంఐలు కట్టాల్సిన అవసరం ఉండదని గుర్తుంచుకోవాలి.
ఇక సొంతిల్లు అయినా మనకు అనుకూలంగా కట్టుకోవచ్చు. ఒకేసారి కొంతమొత్తం హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకుంటే జీవితాంతం అద్దె చెల్లించాల్సిన పని ఉండదు. ఈఎంఐల మీద 80సి కింద హోమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్ పై రూ. 1.15 లక్షల వరకు తగ్గింపు ఉంటుంది. సెక్షన్ 24 కింద వడ్డీపై మరో రూ. 2 లక్షల వరకు మినహాయింపు దక్కుతుంది. ఇన్ని సదుపాయాలు ఉన్నందున సొంతింటిని నిర్మించుకోవడమే బెటర్ అని చెబుతుంటారు.