JAISW News Telugu

Renault New Cars : అద్భుతమైన ఫీచర్లతో రెనాల్డ్ కొత్త కార్లు

Renault New Cars

Renault New Cars

Renault New Cars : ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్డ్ ఇండియా కొత్త రకమైన కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. రెనాల్డ్ క్విడ్, ట్రైబర్, కిగర్ కార్లన అప్ డేట్ చేసి మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కొత్త ఫీచర్లతో ఆవిష్కరణకు సిద్ధమైంది. కొత్త కలర్ స్కీములతో ముందుకొస్తోంది. భారత మార్కెట్లో సరికొత్త ఫీచర్లు భద్రతా లక్షణాలతో ప్రజాదరణ పొందుతున్నాయి. రెనాల్డ్ ఈ సంవత్సరంలో మూడు కార్లను అందుబాటులోకి తీసుకురానుంది.

కొత్త రెనాల్డ్ క్విడ్ క్లైంబర్ వర్షన్ మూడు కొత్త డ్యూయల్ టోన్ ఎక్స్ టీరియర్ బాడీ షేడ్స్ తో తీసుకొచ్చింది. రెనాల్డ్ క్విడ్ ఈజీ వేరియంట్ తో జత చేయబడింది. సరసమైన ధరలకు అందించే విధంగా హ్యాచ్ బ్యాక్ గా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో ప్రధానంగా 14 సేఫ్టీ ఫీచర్లను ప్రవేశపెట్టింది. రెనాల్డ్ క్విడ్ ధర రూ. 4.69 లక్షలుగా ఉంది. దీంతో దీన్ని కొనుగోలు చేసేందుకు అందరు పోటీ పడుతున్నారు.

రెనాల్డ్ ను సరికొత్తగా ఆకర్షణీయంగా తయారు చేశారు. డ్రైవర్ సీటు అర్మ్ రెస్ట్, ఎలక్ర్టికల్ పోల్డబుల్ అవుట్ స్టేటడ్ రియర్ వ్యూ మిర్రర్స్, 7 అంగుళాల టీఎఫ్ టీ భాగాలు క్లస్టర్ తో పాటు వైర్ లెస్ చార్జర్ ను వాడుకోవచ్చు. ఇందులో ఆర్ఎక్స్ టీ వేరియంట్ లో రియర్ వ్యూ కెమెరా, రియర్ వైపర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఆర్ఎక్స్ ఎల్ వేరియంట్ లో రియర్ ఏసీ వెంట్స్ ఉంటుంది. ఎల్ ఈడీ క్యాబిన్ లైట్లు, పీఎం 2.5 ఎయిర్ ఫిల్టర్ ఉంచారు. కొత్త రెనాల్డ్ ట్రైబర్ లోని అన్ని వేరియంట్లలో 15 సేఫ్టీ ఫీచర్లు, రియర్ సీట్ బెల్ట్ రిమైండర్ ను స్టాండర్డ్ గా పెట్టారు. స్టీల్డ్ బ్లాక్ బాడీ కలర్ ఆప్షన్ లోనూ ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధర రూ.5.99 లక్షలు (ఎక్స్ షోరూం)గా ఉంది. దీన్ని చాలా మంది ఇష్టపడుతున్నారు.

రెనాల్డ్ కిగర్ కూడా మంచి ఆకర్షణీయమన కారు. ఇందులో సెమీ లెథెరెట్ సీట్లు ఉన్నాయి. లెథెరెట్ స్టీరింగ్, ఆటో పోల్డ్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ జోడించారు. ఆర్ వీఎం ఇన్ సైడ్ రియర్ వ్యూ, మిర్రర్ ను కలిగి ఉండటం దీని ప్రత్యకత. టర్బో ఇంజిన్ రెడ్ డ్రేక్ కాలిఫర్ ను కలిగి ఉండటంతో దీన్ని చాలా మంది కొనుగోలు చేయడానికి ముందుకొస్తున్నారు.

Exit mobile version