JAISW News Telugu

Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ చీఫ్ వార్డెన్ ను తొలగించండి: ఎస్సీ, ఎస్టీ కమిషన్

Basara IIIT

Basara IIIT

Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటించింది. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, చీఫ్ వార్డెన్ శ్రీధర్ పిల్లలను ఇబ్బంద పెడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. అసభ్యకరంగా ప్రవర్తించిన చీఫ్ వార్డెన్ శ్రీధర్ పై అధికంగా ఫిర్యాదులు రావడంతో విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఫ్యాకల్టీల కొరత.. సరిపడ కేర్ టేకర్లు లేరని విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు తెలిపారు. ముందుగా తాము విజిట్ చేసేందుకు వస్తున్నామని సమాచారం ఇచచినా, చీఫ్ వార్డెన్ శ్రీధర్ కమిషన్ ఎదుట హాజరు కాకపోవడంతో అధికారులు సీరియస్ అయ్యారు.

బాసర ట్రిపుల్ ఐటీలో ఆరు వేత బాలికలు విద్యనభ్యసిస్తుండగా కేవలం నలుగురు మాత్రమే కేర్ టేకర్లు ఉండడంపై కమిషన్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేర్ టేకర్లను పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. కళాశాలలో సరిపడా ఫ్యాకల్టీ లేరని, ఉన్నత విద్యలో చాలా ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ఇన్ చార్జి వీసీ వెంకటరమణ సమాధానం ఇస్తూ ప్రభుత్వం ఫ్యాకల్టీలను నియమించేలా కసరత్తు చేస్తుందని కమిషన్ కు వివరించారు. విద్యార్థనిలతో అసభ్యకరంగా ప్రవర్తించిన చీఫ్ వార్డన్ శ్రీధర్ పై అధికంగా ఫిర్యాదులు రావడంతో విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.

Exit mobile version