JAISW News Telugu

Chennai Express : నారాయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్ ప్రెస్ లకు స్టాప్ ల ఎత్తివేత

Chennai Express

Chennai Express

Chennai Express : తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే ప్రధాన ఎక్స్ ప్రెస్ రైళ్ల స్టాపులను ఎత్తివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే నారాయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్ ప్రెస్ రైళ్లకు సంబంధించిన ఈ స్టాపుల మార్పుపై అధికారులు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. నారాయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్ ప్రెస్ రైళ్లకు ఈ నెల 19 నుంచి మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లలో స్టాప్ లను ఎత్తివేస్తూ రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు సమస్యగా మారనుంది.

కరోనా సమయంలో రైల్వేబోర్డు అధికారులు నారాయణాద్రి, విశాఖ, చెన్నై రైళ్లకు ఆయా స్టేషన్లలో నిలపకుండా ఆదేశాలు జారీచేశారు. దీంతో ఉమ్మడి, నల్గొండ, గుంటూరు జిల్లాల ప్రయాణికులు ఆందోళనలు చేపట్టారు. అప్పటి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా రైల్వే బోర్డు అధికారులను కలిసి విన్నవించడంతో ఏడాది క్రితం రైళ్లకు స్టాప్ ఏర్పాటు చేశారు. అప్పట్లో ఏడాది పాటు రైళ్లను నిలిపేందుకు ఆదేశాలు ఇవ్వడంతో ఆ సమయం ఈ నెల 19తో ముగియనుంది. దీంతో ఆ రోజు నుంచి విశాఖ, నారాయణాద్రి, చెన్నై ఎక్స్ ప్రెస్ లకు రైల్వే ఐఆర్సీటీసీ అధికారులు మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల స్టేషన్లకు రిజర్వేషన్లు నిలిపివేశారు.

Exit mobile version