Cyclone Remal : రెమల్ బీభత్సం.. మిజోరాంలో క్వారీ కూలి 10 మంది మృతి

Cyclone Remal

Cyclone Remal

Cyclone Remal  : రెమల్ తుఫాను ప్రభావంతో మిజోరాంలో కురిసిన భారీ వర్షాలకు రాళ్ల క్వారీ కూలి 10 మంది మృతి చెందారు. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమల్ తుఫాను ఆదివారం రాత్రి బెంగాల్, బంగ్లాదేశ్ వద్ద తీరం దాటినా ఇంకా విధ్వంసం కొనసాగుతూనే ఉంది. తుఫాను ప్రభావంతో బెంగాల్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి.

తాజాగా మిజోరాంలో రాళ్ల క్వారీ కూలి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐజ్వాల్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఒక చిన్నారి సహా పది మంది మృతి చెందినట్లు అధికారుల తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలే కొనసాగుతున్నాయని, శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. కొండ చరియలు విరిగి పడుతుండడంతో రెస్క్యూ సిబ్బందికి ప్రమాదం పొంచి ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శిథిలాల నుంచొ ఓ చిన్నారిని బయటకు తీసి, చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

TAGS