Vijayasai Reddy : గత కొద్దిరోజులుగా చాలా మీడియా సంస్థలు తప్పుడు కథనాలు రాస్తున్నాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఫైర్ అయిన సందర్భాలు మనం చూశాం. ఇలాంటి వార్తలు రాసేవారిని వదిలిపెట్టేది లేదని విజయసాయిరెడ్డి అప్పట్లో హెచ్చరించారు. ఈ క్రమంలో ఆయన చాలా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.
విజయసాయిరెడ్డి వ్యక్తిగత జీవితంపై రకరకాల రూమర్లు సృష్టించిన 9 మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయనపై వస్తున్న కథనాలను వెంటనే తొలగించాలని ఢిల్లీ హైకోర్టు కూడా ఆదేశించింది. భవిష్యత్తులో ఎలాంటి ఆధారాలు లేని కథనాలను ప్రసారం చేయకూడదని కూడా నిర్ణయించింది.. ముఖ్యంగా ఈటీవీ, ఆర్టీవీ, టీవీ5, మహాన్యూస్, ఆంధ్రజ్యోతితో పాటు తొమ్మిది సంస్థలకు ఢిల్లీ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది.
విజయసాయిరెడ్డి ఇచ్చిన తరహాలో నిరాధారమైన కథనాలను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది. వీటన్నింటిని వెంటనే బ్లాక్ చేయాలని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఎవరూ ఇలాంటి కథనాలను ప్రసారం చేయవద్దని కోర్టు సూచించింది. తనకు సంబంధం లేని విషయంలో తన పేరు ప్రస్తావిస్తున్నారని కనీసం తన వివరణ కూడా తీసుకోకుండా వ్యక్తిగత విషయంపై రకరకాల కథనాలు రాయడం సరైన పద్ధతి కాదని విజయసాయి రెడ్డి తెలియజేసారు.
అంతేకాకుండా 10 కోట్లకు ఢిల్లీ హైకోర్టులో పరువునష్టం దావా కూడా వేసినట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు విజయసాయిరెడ్డికి అనుకూలంగా కూడా ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన చేసిన పలు కథనాలను వెంటనే తొలగించాలని పలు టీవీ ఛానళ్లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.