JAISW News Telugu

Shilpa Shetty : మనీ లాండరింగ్ కేసులో శిల్పాశెట్టి దంపతులకు ఊరట

Shilpa Shetty

Shilpa Shetty

Shilpa Shetty : మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ స్టార్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలకు భారీ ఊరట లభించింది. ముంబైలోని జుహు ప్రాంతంలోని ఇల్లు, పావ్నా సరస్సు సమీపంలోని ఫామ్ హౌస్ ను ఖాళీ చేయాలని ఈడీ పంపిన నోటీసులపై బాంబే హైకోర్టు స్టే విధించింది. 2017లో రాజ్ కుంద్రా సంస్థ బిట్ కాయిన్ ల రూపంలో దాదాపు రూ.6,600 కోట్లు వసూలు చేసిందని ఆరోపణలు వచ్చాయి. నెలకు 10 శాతం రిటర్న్ లు ఇస్తామని చెప్పి ఇన్వెస్టర్లను మోసం చేశారని కేసు నమోదైంది. ఈ పథకం సూత్రధారి అమత్ భరద్వాజ్ నుంచి రాజ్ కుంద్రా దాదాపు 285 బిట్ కాయిన్లు తీసుకున్నట్లు సమాచారం.

శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలకు చెందిన రూ.98 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. ఆ బిట్ కాయిన్లతో ఉక్రెయిన్ లోని మైనింగ్ ఫామ్ తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై విచారణ చేపట్టిన ఈడీ శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలకు చెందిన రూ.98 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ముంబైలోని జుహూలో శిల్పాశెట్టి పేరిట ఉన్న బంగ్లా, పూణేలోని ఫ్లాట్, కుంద్రా పేరిట ఉన్న ఈక్విటీ షేర్లను సీజ్ చేసినట్లు ఈడీ తెలిపింది. ఈ నేపథ్యంలోనే గత నెల 27న భవనాలను ఖాళీ చేయాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఈడీ నోటీసులకు వ్యతిరేకంగా శిల్పాశెట్టి దంపతులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు ఈడీ నోటీసులపై స్టే విధించింది.

Exit mobile version